కాజల్ సంగతి అందుకే తేలలేదా?

కాజల్ సంగతి అందుకే తేలలేదా?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిన మాట వాస్తవమే. కెరీర్ గందరగోళంలో పడిందని అనుకున్న పొజిషన్ నుంచి ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉన్న భామగా మారిపోయంది. అటు అగ్రహీరోల సినిమాలతో పాటు ఇటు కుర్రహీరోల సినిమాలకు కూడా సై అనేసేందుకు సిద్ధంగా ఉంది.

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ హీరోయిన్ గా హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ను ఓకే చేయగా.. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు స్కోప్ ఉందనే మాట ముందు నుంచి వినిపిస్తోంది. ఈ పాత్రను కాజల్ తో చేయించాలన్నది దర్శకుడి ఆలోచన. అదే విషయాన్ని ఓపెన్ గానే చెప్పేశాడు. కానీ చందమామ నుంచి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇందుకు కారణంగా రెమ్యూనరేషన్ విషయం ఇంకా తేలలేదట.

కాజల్ అగర్వాల్ చెప్పిన ఫిగర్.. సాధారణంగా ఆమె తీసుకునే మొత్తం కంటే ఎక్కువ అంటున్నారు. అయితే.. ఈ సినిమాలో కాజల్ ది కీలకమైన పాత్రే అయినా.. కళ్యాణితో పోల్చితే రన్ టైం తక్కువగా ఉంటుందట. కానీ చందమామ మాత్రం తను అడిగిన మొత్తం ఇస్తేనేనే సంతకం చేస్తానని భీష్మించుకుని కూర్చుందట. అలా కాజల ఇంకా ఏమీ తేల్చకపోవడంతోనే ఈ విషయం ఇంకా సస్పెన్స్ లో ఉండిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు