కంఫర్ట్‌ జోన్‌ వదిలేసిన బెల్లంకొండ

కంఫర్ట్‌ జోన్‌ వదిలేసిన బెల్లంకొండ

బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇంతకుముందు వరకు ఎక్స్‌పీరియన్స్‌ వున్న స్టార్‌ దర్శకుల వైపే మొగ్గు చూపాడు. వినాయక్‌, బోయపాటి శీను లాంటి వాళ్లకి భారీ పారితోషికం ఇచ్చి మరీ తనని స్టార్‌ని చేసే బాధ్యతలు అప్పగించాడు. ఆశించిన ఫలితాలు రాకపోయినా హీరోగా గుర్తింపు అయితే వచ్చింది. దీంతో నెమ్మదిగా స్టార్‌ డైరెక్టర్లతోనే చేయాలనేది పక్కన పెట్టి ప్రస్తుతం శ్రీవాస్‌తో సాక్ష్యం చేస్తున్నాడు.

మాస్‌ సినిమాల దర్శకుడిగా పేరున్న శ్రీవాస్‌ మినిమం గ్యారెంటీ దర్శకుడే. ఇకపోతే తర్వాతి చిత్రానికి అసలు అనుభవమే లేని కొత్త దర్శకుడితో శ్రీనివాస్‌ పని చేస్తున్నాడు. పలువురు స్టార్‌ డైరెక్టర్ల దగ్గర చేసిన శ్రీనివాస్‌ అనే దర్శకుడితో రూపొందే ఈ చిత్రాన్ని నవీన్‌ శొంఠినేని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు కొత్త అయినా కానీ మిగతా వాళ్లంతా పేరున్న టెక్నీషియన్సే.

తమన్‌, చోటా కె నాయుడు లాంటి హేమాహేమీలని తీసుకున్నారు. హీరోయిన్ల పరంగా కాంప్రమైజ్‌ కాని బెల్లంకొండ ఈ చిత్రంలో ఎవరిని నాయికగా పెట్టుకుంటాడో ఏమో? జయ జానకి నాయక ఫ్లాప్‌ అవడంతో సాక్ష్యం చిత్రంతో ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన ఒత్తిడిని ఫేస్‌ చేస్తున్నా కూడా ధైర్యంగా కొత్త దర్శకుడితో ముందుకెళుతున్నాడంటే తెగింపు వచ్చేసిందనే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English