అల్లు అర్జున్‌ వల్ల అయ్యే పనేనా?

అల్లు అర్జున్‌ వల్ల అయ్యే పనేనా?

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ఎన్టీఆర్‌ రాణించడానికి కారణం అతనికి వున్న కమ్యూనికేషన్‌ స్కిల్స్‌. ఇండస్ట్రీలోని అందరినీ ఏదో ఒక వరస పెట్టి పిలుస్తూ చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అందరు ఆర్టిస్టులతోను మంచి రిలేషన్స్‌ మెయింటైన్‌ చేస్తాడు. అదే అతనికి బిగ్‌బాస్‌ హోస్ట్‌గా సక్సెస్‌ అవడానికి దోహదపడింది. కంటెస్టెంట్స్‌తో మంచి రిలేషన్‌ ఏర్పరచుకుని, వారితో ఏర్పడిన బాండింగ్‌తోనే షో రక్తి కట్టించాడు.

అందుకే ఇప్పుడు సీజన్‌ 2కి ఎన్టీఆర్‌ స్థానం తీసుకునేదెవరు అనేదానిపై అంత తర్జనభర్జన పడుతున్నారు. అతనిలాంటి స్టార్‌ని తీసుకుని రాగలరు కానీ, అతని మాదిరిగా కమ్యూనికేషన్‌తో అదరగొట్టే సత్తా వున్నదెవరు? సీజన్‌ 2 హోస్ట్‌గా అల్లు అర్జున్‌ చేసే ఛాన్స్‌ వుందని అంటున్నారు కానీ బన్నీ తారక్‌ మాదిరిగా మాటకారి కాదు. పైగా ఆవేశంలో 'ట్రిప్‌' అయ్యే మెంటాలిటీ వుంది. ఇదే పద్ధతితో పవన్‌ అభిమానులకి చెప్పను బ్రదర్‌ అంటూ విలన్‌ అయ్యాడు.

తర్వాత తన అభిమానులకి కూడా తరచుగా క్లాస్‌లు పీకుతూ ఇంటర్నెట్‌లో ట్రోల్‌ అవుతున్నాడు. ఎంటర్‌టైనర్‌ అనే విషయంలో లోటు లేకపోయినా, ఎనర్జీకి ఏమాత్రం తక్కువ కాకపోయినా ఎన్టీఆర్‌ మాదిరిగా కలుపుగోలుతనం బన్నీకి వుందా అనేది అది పెద్ద ప్రశ్న. మనకి తెలిసిన పబ్లిక్‌ బిహేవియర్‌తో అయితే బన్నీ ఇంతవరకు మార్కులు కొట్టలేదు. మరి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే అందుకు తగ్గట్టు అడ్జస్ట్‌ చేసుకుంటాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు