కజిన్‌ని కాపీ కొడుతున్న సాయి ధరమ్‌ తేజ్‌!

కజిన్‌ని కాపీ కొడుతున్న సాయి ధరమ్‌ తేజ్‌!

వరుసగా అయిదు డిజాస్టర్లతో తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డ సాయి ధరమ్‌ తేజ్‌కి ఇంకా మార్కెట్‌ పరంగా వచ్చిన ఢోకా అయితే లేదు. ఎందుకంటే నిర్మాతలు ఇంకా అతడిని తీసి పారేయడం లేదు. బ్యాడ్‌ సినిమాలు చేసి దెబ్బలు తిన్నాడే తప్ప సాయిధరమ్‌ తేజ్‌ చేసిన పెద్ద మిస్టేక్స్‌ అంటూ లేవు.

అవుట్‌డేటెడ్‌ అయిపోయిన కృష్ణవంశీ, వినాయక్‌ని నమ్మడం, మంచి ట్రాక్‌ రికార్డ్‌ వుందని గోపిచంద్‌ మలినేనిని బ్లయిండ్‌గా నమ్మేయడం అతడిని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇక జవాన్‌ రిలీజ్‌ టైమింగ్‌ బ్యాడ్‌ కాగా, తిక్క సినిమాని స్నేహితుల కోసం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఎనాలిసిస్‌ వల్లేనేమో ఇంకా తేజుకి సినిమాలైతే వస్తున్నాయి. కాకపోతే ఇదే మూసలో సినిమాలు చేసుకుంటూ పోతే నష్టపోవడం ఖాయం కనుక అతను ఇప్పుడు తన కజిన్‌ వరుణ్‌ తేజ్‌ ఎంచుకున్న మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఫిదా చిత్రం మాదిరిగా కరుణాకరన్‌తో చేస్తోన్న సినిమా కూడా హీరోయిన్‌ ప్రధానంగా వుంటుందట. అందుకే ఈ పాత్రకి చక్కని నటిగా పేరు తెచ్చుకున్న అనుపమని తీసుకున్నారు. ఫిదా చిత్రానికి సాయి పల్లవి హైలైట్‌ అయినట్టు ఇందులో అనుపమ పాత్ర చాలా బాగుంటుందట. మరి కజిన్‌ని కాపీ కొడుతూ చేస్తోన్న ఈ ప్రయత్నమైనా తేజుకి సక్సెస్‌ ఇస్తుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English