బోయపాటిని విసిగిస్తున్న రామ్‌ చరణ్‌

బోయపాటిని విసిగిస్తున్న రామ్‌ చరణ్‌

హీరో ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమా మొదలు పెట్టడం వల్ల వుండే తలనొప్పులు ఏమిటనేది బోయపాటి కొత్త సినిమా బృందానికి తెలిసి వస్తోందట. రంగస్థలం షూటింగ్‌ పూర్తి కాగానే బోయపాటి చిత్రాన్ని మొదలు పెట్టడానికి రామ్‌ చరణ్‌ డేట్స్‌ ఇచ్చాడు. అయితే ఆ సినిమాకి రీషూట్‌ అంటూ మరోసారి డేట్స్‌ ఇవ్వడంతో బోయపాటి సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌కి చరణ్‌ అందుబాటులో లేడు.

రంగస్థలం షూటింగ్‌ పూర్తయ్యాక అయినా తన సినిమాపై కాన్సన్‌ట్రేట్‌ చేస్తాడని బోయపాటి ఆశించాడు. కానీ చరణ్‌ ఇంకా రంగస్థలం హ్యాంగోవర్‌లోనే వుంటూ దాని గురించే చర్చిస్తున్నాడట. దాని ప్రమోషన్స్‌ మీద, బిజినెస్‌ వ్యవహారాల మీద శ్రద్ధ తీసుకుంటున్నాడట. రంగస్థలం విడుదలై, ఆ హడావిడి పూర్తి కావడానికి ఇంకా నెల రోజులు పైగానే పడుతుంది. ఈలోగా హీరో మూడ్‌ ఇటు డైవర్ట్‌ అవకపోతే ఎలాగని బోయపాటి తల పట్టుకున్నాడట. మరోవైపు ఆగస్టులోగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసేయాలనే డెడ్‌లైన్‌ కూడా వుందట. మొత్తానికి చరణ్‌ అమితంగా ఆశలు పెట్టుకున్న సినిమా రిలీజ్‌ కాకముందే తన చిత్రాన్ని సెట్స్‌ మీదకి తీసుకెళ్లడం  బోయపాటికి తగని తంటా తెచ్చిపెట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు