ప్రభాస్‌ అనుకున్నదొకటి, అవుతుందొకటి

ప్రభాస్‌ అనుకున్నదొకటి, అవుతుందొకటి

బాహుబలితో నేషనల్‌ లెవల్లో పాపులర్‌ అయిన ప్రభాస్‌ తన తదుపరి చిత్రాన్ని కూడా నేషనల్‌ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాడు. ప్రధానంగా తెలుగు హీరో అయినా కానీ సాహో చిత్రాన్ని తెలుగు వాళ్లని దృష్టిలో పెట్టుకుని చేయడం లేదు. హిందీ తారాగణం వుంటే నార్త్‌ మార్కెట్‌లో సేల్‌ అవుతుందని శ్రద్ధ కపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌లాంటి వాళ్లని తెచ్చారు. అయితే వాళ్ల వల్ల ఈ చిత్రానికి ఒరిగిన ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. ఇంతవరకు సాహోకి నార్త్‌ మార్కెట్‌ నుంచి ఆఫర్లేమీ రాలేదు. హిందీ మార్కెట్‌ని నమ్ముకుని ఈ చిత్రం బడ్జెట్‌ని రెండింతలు చేసారు.

ఒక్క యాక్షన్‌ సీన్‌ కోసమే ముప్పయ్‌ కోట్లకి పైగా వెచ్చించినట్టు చెప్పుకున్నారు. కరణ్‌ జోహార్‌తో ప్రభాస్‌ రిలేషన్స్‌ చెడిపోవడంతో సాహో చిత్రానికి అటునుంచి పెద్ద నిర్మాతల అండ కరవైంది. బాహుబలి చిత్రాన్ని కేవలం తెలుగు మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని తీసినా కానీ జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. సాహో టీమ్‌ వేరే విధంగా లెక్క వేస్తే ఇంతవరకు వాళ్లు వేసిన ఏ ప్లాన్లు ఆశించిన ఫలితాలని ఇవ్వలేదు. మరోవైపు దీని బడ్జెట్‌ భారీగా పెరిగిపోవడంతో యువ దర్శకుడు సుజిత్‌ ఒత్తిడికి గురవుతూ మామూలుగా కంటే చాలా ఎక్కువ టైమ్‌ తీసుకుంటున్నాడట.