అమ్మాయిలా రెడీ అవ్వాలంటే కష్టమే

అమ్మాయిలా రెడీ అవ్వాలంటే కష్టమే

అందంగా ఉండడానికి నిజంగా అమ్మాయిలు తీసుకునే జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే చాలా కష్టపడతారు. అయితే అబ్బాయిలు అమ్మాయిల్లా కనిపించడం ఈ రోజుల్లో సాధారణం అయిపొయింది. లేడి గెటప్స్ లో కనిపించడానికి కొంత మంది యువ నటులు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే అలా కనిపించడానికి ఎదో సింపుల్ గా షేవింగ్ చేసుకొని కాస్ట్యూమ్ లో పౌడర్ తగిలిస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే.  

రీసెంట్ గా ఒక యువనటుడు లేడి గెటప్ కోసం ఎంతగా కష్టపడ్డాడో మేకింగ్ వీడియో ద్వారా చూపించాడు. అతనెవరో కాదు. జనతా గ్యారేజ్ ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఉన్ని ముకుందన్. ఆ సినిమాలో మోహన్ లాల్ కుమారుడిగా నెగిటివ్ రోల్ లో కనిపించాడు. ఇటీవల భాగమతిలో కూడా అనుష్క సరసన నటించాడు. అయితే మలయాళంలో తెరకెక్కుతోన్న చాణక్య తంత్రం సినిమాలో ఉన్ని ముకుందన్ ఇలా లేడి గెటప్ లో కనిపించబోతున్నాడట.

కన్నన్ తమరక్కుల్లమ్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఉన్ని ముకుందన్ ఆ సినిమాలో లేడి గెటప్ వేయడానికి బ్యూటీ పార్లర్ కి వెళ్లి స్పెషల్ గా రెడీ అయ్యాడు. అందుకు సంబందించిన మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. మొత్తంగా చీర కట్టులో అతను అచ్చం అమ్మాయిలనే కనిపిస్తున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ క్యారెక్టర్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు