ఆ సింగ‌ర్‌కి చుక్క‌లు చూపిస్తున్న స‌ల్మాన్‌

 ఆ సింగ‌ర్‌కి చుక్క‌లు చూపిస్తున్న స‌ల్మాన్‌

స‌ల్మాన్ ఖాన్‌... బాలీవుడ్‌ను అన‌ధికారికంగా ఏలుతున్న రాజు. అత‌ను ఏం చెపితే చాలా ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు అదే చేసే ప‌రిస్థితి. అలాంటి వ్య‌క్తితో ఓ చిన్న సింగ‌ర్‌కి వివాదం రాజుకుంది. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆ సింగ‌ర్‌కి చుక్క‌లు చూపిస్తున్నాడు స‌ల్లూ. అత‌ని పాట‌ల‌ను సినిమాల్లోంచి తొలగించేస్తున్నాడు.

అరిజిత్ సింగ్‌... బాలీవుడ్లో మంచి పాట‌లు పాడాడు. సూప‌ర్ హిట్ అయిన గేరువా, తుమ్ హీహో పాట‌లు త‌నవే. నోరు అదుపులో పెట్టుకోకుండా అయ‌న చేసిన కామెంట్ స‌ల్మాన్ కు కోపం తెప్పించింది. ఇంకేముంది మూడేళ్లుగా ర‌గిలిపోతున్నాడు స‌ల్మాన్‌. 2014లో ఒక అవార్డుల ఫంక్ష‌న్‌లో అరిజిత్ అవార్డు అందుకునేందుకు వేదిక మీద‌కి వెళ్లాడు. అక్క‌డ అవార్డు ఇచ్చేందుకు స‌ల్మాన్‌, రితేష్ దేశ్‌ముఖ్ సిద్దంగా ఉన్నారు. వారిద్ద‌రితో మీరు మ‌మ్మ‌ల్ని నిద్ర‌పోయేలా చేస్తున్నారు అని కామెంట్ చేశాడు. దానికి స‌ల్మాన్ అది మా త‌ప్పు కాదు... అలాంటి పాట‌లు వినిపిస్తున్నాయి మ‌రి... అని కామెంట్ చేసి అరిజిత్ పాడిన తుమ్ హీహో సాంగ్ పాడాడు. వివాదం అక్క‌డే మొద‌లైంది. అరిజిత్ చేసిన వ్యాఖ్య‌లు స‌ల్మాన్‌కి కోపం తెప్పించాయి.

స‌ల్మాన్ సినిమా సుల్తాన్ లో అరిజిత్ ఓ సాంగ్ పాడాడు. దానిని తీయించేసి... వేరే వాళ్ల చేత ఆ పాట పాడించేలా చేశాడు స‌ల్మాన్‌. అరిజిత్ త‌న కామెంట్ల‌కు క్ష‌మించమ‌ని ఫేస్‌బుక్‌లో స‌ల్మాన్‌ను ఉద్దేశంచి పోస్టు కూడా పెట్టాడు. అది వైర‌ల్ అవ్వ‌డంతో తొల‌గించేశాడు. అయినా స‌ల్మాన్ మ‌న‌సు క‌ర‌గ‌లేదు. పాట తీసేయ‌డం అనేది ద‌ర్శ‌క నిర్మాత‌లు తీసుకునే నిర్ణ‌య‌మ‌ని చెప్పాడు.

ఇప్పుడు వెల్‌క‌మ్ టు న్యూయార్క్ సినిమాలో కూడా అరిజిత్ ఓ పాట పాడాడు. అందులో స‌ల్మాన్ హీరో కాక‌పోయినా... గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఆ సినిమాలో పాట కూడా తొల‌గించేలా చేశాడు. దీంతో పాపం అరిజిత్ ఏం చేయాలో తెలియ‌క జుట్టుపట్టుకుంటున్నాడు. అత‌ను గ‌తంలో స‌ల్మాన్ క‌లిసి మ‌రీ క్ష‌మాప‌ణ చెప్పాడు. అయినా ఫలితం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు