ఇంకా ఆడిషన్స్ కు వెళుతోంది..

 ఇంకా ఆడిషన్స్ కు వెళుతోంది..

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ తగినంత గుర్తింపు ఉన్న భామ రెజీనా కసాండ్రా. అటు అందం.. ఇటు పెర్ఫామెన్స్ రెండూ ఉన్న ఈ సుందరాంగికి కాలం ఇప్పటివరకూ పెద్దగా కలిసి రాలేదు. ట్యాలెంట్ ఉన్నా సరైన అవకాశాలు అందుకోవడంలో అది చూపలేకపోవడంతో.. కెరీర్ గాడిలో పడలేదు. విధు వినోద్ చోప్రా నిర్మాతగా.. ఆయన సోదరి షెల్లీ చోప్రా ధర్ దర్శకత్వంలో రూపొందనున్న మూవీ 'ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా' చిత్రంలో ఓ కీలక పాత్రకు రెజీనా కసాండ్రా ఎంపికైంది.

వెస్ట్రన్ లుక్ ఉన్న ఓ దక్షిణాది భామను ఎంచుకునేందుకు దర్శకురాలు వెతుక్కోగా.. చివరకు రెజీనా దగ్గర ఆ సెర్చింగ్ ఆగింది. సోనమ్ కపూర్.. రాజ్ కుమార్ రావు.. అనిల్ కపూర్.. జూహీ చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అవకాశం రావడం.. రెజీనా కెరీర్ ను మలుపు తిప్పే ఘటనగా చెప్పవచ్చు. ఈ ఛాన్స్ అందుకోవడంలో రెజీనా పాటించిన విధానం మాత్రం పొగడాల్సిన విషయం. దక్షిణాదిలో బోలెడంత గుర్తింపు ఉన్నా.. తమిళ- తెలుగు సినిమాల్లో అనేక ఛాన్సులు ఉన్నా సరే.. ఆడిషన్స్ కు అటెండ్ అయి మరీ బాలీవుడ్ ఆఫర్ అందుకుంది రెజీనా కసాండ్రా.

కాసింత గుర్తింపు వస్తే చాలు.. ఇక మొత్తం యాక్టింగ్ అంతా వచ్చేసినట్లు పోజు కొట్టే రోజులు ఇవి. కానీ రెజీనా మాత్రం.. అనేక బాలీవుడ్ సినిమాల ఆడిషన్స్ కు కూడా అటెండ్ అవుతోంది. ఇండస్ట్రీలోకి అప్పుడే వచ్చిన అమ్మాయి మాదిరిగా.. తనను తాను ప్రూవ్ చేసుకుని మరీ ఛాన్స్ అడుగుతోంది. అందుకే ఈ విషయంలో రెజీనాను ఎంతైనా పొగడచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు