నెట్లో రెడీగా నాన్నకూచి నీహారిక

 నెట్లో రెడీగా నాన్నకూచి నీహారిక

మొత్తానికి నీహారిక తర్వాత ప్రాజెక్ట్ ఏంటా అనే ప్రశ్నకు ఓ సమాధానం అయితే గతంలోనే వచ్చింది. నాన్నకూచి అంటూ ఓ ప్రాజెక్టు చేసింది కానీ.. దీని విషయంలో కాస్త కన్ ఫ్యూజన్ వచ్చేసింది.  ఇంతకీ ఇది సినిమానా.. లేక వెబ్ సిరీస్.. ఏదో అర్ధం కాలేదు. మొదట నాన్నకూచి సినిమా అనేసింది. తరువాత కాదు వెబ్ సిరీస్ అని చెప్పింది. మళ్లీ సినిమా అనింది కూడా.

ఇప్పుడేమో వెబ్ సిరీస్ అంటూ జీ తెలుగువాళ్ళు తమ కొత్త వెబ్ సైట్ జీఫైవ్ లో నాన్నకూచి పోస్ట్ చేసేశారు. ఇప్పటికి ఇది వెబ్ సిరీస్ అంటూ క్లారిటీ వచ్చేసింది. సిరీస్ మొత్తం ఎంచక్కా నెట్ లోకి వచ్చేసింది. మొదట ఈ భామ లవ్ స్టోరీ.. ఆ తర్వాత తండ్రిని తన మాజీ ప్రియురాలితో కలిపేందుకు తపన పడే కూతురి కథే ఈ నాన్నకూచి. నీహారిక సోదరుడు వరుణ్‌ తేజ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

ఆ రకంగా వెబ్ సిరీస్ రూపంలో నాన్నకూచి ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయింది. ఇప్పటికి అయితే రెస్పాన్స్ బాగానే ఉంది. జనాలు కూడా నాన్నకూచి కాన్సెప్ట్ ను బాగానే మెచ్చుతున్నారు. ఒకేసార మొత్తం సిరీస్ అంతా వెబ్ లో ప్రత్యక్షం అయిపోయింది. అలా నాన్నకూచిపై జనాలకు తనే అప్ డేట్ ఇచ్చి.. జీ5 ఒరిజినల్స్ గురించి డీటైలింగ్ ఇచ్చింది నీహారిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English