లెస్బియన్.. కొత్తగా అ!నిపించింది

లెస్బియన్.. కొత్తగా అ!నిపించింది

సినిమా హీరోయిన్స్ అవకాశాల కోసం రెమ్యునరేషన్  కోసం కొన్ని తప్పటి అడుగులు వేస్తారు అని కామెంట్ చేసేవారికి నిత్యామీనన్ కెరీర్ ఒక చెప్పు దెబ్బ లాంటిది. పారితోషకం వల్ల గాని ఇంకో విషయం వల్ల గాని ఆమె సినిమాలకి ఒకే చెప్పదు అనేది చాలా మందికి తెలిసిన విషయమే. పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ లో తేడా వచ్చినా పరవాలేదు. కానీ కథ కొంచెం నచ్చకపోయినా నిత్యా డబుల్ పేమెంట్ ఇచ్చినా ఒప్పుకోదు అని సినీ ఇండస్ట్రీలో ఉన్న గట్టి టాక్.

నిత్యా కూడా ఇదే విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. నాకు కథ నచ్చితే..నా వల్ల సినిమాకు కొంచెం లాభం ఉంటే తప్పకుండా నటిస్తా. నచ్చకుంటే మంత్రం మొహం మీదే చెప్పేస్తా అదే నా స్వభావం అని నిత్యా చెబుతోంది. ఇంకా ఏమందంటే.. నా కెరీర్ లో ఏ పాత్రకు ఎక్కువగా కష్టపడలేదు. అలాంటి పాత్రలు కూడా ఎక్కువగా రాలేదు. కానీ ఒకే ఒక్క సినిమాకు మాత్రం చాలా కష్టపడ్డా. అదే గంగా సినిమాకు. ఆ సినిమా కోసం శారీరకంగా మెంటల్ గా చాలా కష్టపడ్డా. నా కెరీర్ లో అదొక ఛాలెంజ్ రోల్.

ఇక అ! సినిమా కథలో లెస్బియన్ గా కనిపించడం కొంచెం కొత్తగా అనిపించింది. అందుకే సింగిల్ సిట్టింగ్ లో ఒప్పుకున్నా. కేవలం కథ నచ్చే సినిమా చేశాను. నేనే కాదు అందరు కాన్సెప్ట్ ని దర్శకుడు ప్రశాంత్ వార్మని నమ్మి చేశారు. నేనైతే నాని వల్ల కాదు అని రూమర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం గారి పాత్రకు మొదట మిమ్మల్నే అనుకున్నారట అనే ప్రశ్నకి నిత్యా చాలా సింపుల్ ఆన్సర్ ఇచ్చింది. ఆ సినిమాలో నేను లేను.. అంతే..అంతకు మించి ఎక్కువగా అడగవద్దు. ఇక మహనటిలో సావిత్రి పాత్రకు కూడా మొదట నన్నే అనుకున్నారని అంటూ..ఎందుకో గాని వర్కౌట్ కాలేదని నిత్య సమాధానం ఇచ్చింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English