రోబో 2.0.. సోలో రిలీజ్ కుద‌ర‌దు

రోబో 2.0.. సోలో రిలీజ్ కుద‌ర‌దు

రోబో 2.0 కోసం సినీ ప్రేమికులంతా ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తామ‌ని సినిమా యూనిట్ మొద‌ట్లో ప్ర‌క‌టించింది.కానీ ఆ రోజు విడుద‌ల చేయాల‌న్న ఉద్దేశం మాత్రం ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. అందుకే కదా ఆ రోజు కాలా సినిమాను ప్రకటించారు. అయితే శంక‌ర్ టార్గెట్ ఒక్క‌టే... రోబో విడుద‌ల స‌మ‌యంలో ఇంకే సినిమా విడుద‌ల కాకూడ‌దు. అతి ఎక్కువ ధియేట‌ర్ల‌లో 2.0ను విడుద‌ల చేసి... భారీ ఓపెనింగ్స్ కొట్టాల‌న్న ప్లాన్ ఉన్నాడు. కానీ అత‌ని ఆశ తీరేలా క‌నిపించ‌డం లేదు.

మార్చి, ఏప్రిల్ లో తెలుగులోనూ, త‌మిళంలోనూ పెద్ద సినిమాల విడుద‌ల‌కు ఉన్నాయి. ఇంకా ముందుకు విడుద‌ల చేద్దామా అంటే సినిమా ప‌ని ఇంకా మిగిలే ఉంది. దీంతో ఆగ‌స్టు 15న లేదా, దీపావ‌ళి రోజున విడుద‌ల చేయాల‌న్న ప్లాన్ లో ఉన్నాడు శంక‌ర్‌. కాకపోతే... అప్పుడు కూడా తాను అనుకున్న‌ది జ‌రుగ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే ఆగ‌స్టు 15న అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన గోల్డ్ సినిమా విడుద‌ల కానుంది. రోబో కూడా అప్పుడే విడుద‌లైతే.. అక్ష‌య్ వ‌ర్సెస్ అక్ష‌య్ లా ఉంటుంది పోటీ. పోనీ దీపావ‌ళికి విడుద‌ల చేద్దామా సినిమా అంటే.. ఆ రోజున (నవంబర్ 7న) అమితాబ్‌-అమీర్ ఖాన్ క‌లిసి న‌టిస్తున్న థగ్స్ ఆఫ్‌ హిందోస్తాన్ సినిమా విడుద‌ల‌కు ఉంది. క‌నుక‌... ఆ రెండు పండ‌గ‌ల‌ప్పుడూ థియేట‌ర్లు షేర్ చేసుకోక‌త‌ప్ప‌దు. మ‌రి శంక‌ర్ ప్లానేంటో... సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందో.

రోబో 2.0 తో బాహుబ‌లి హిస్ట‌రీని రిపీట్ చేయాల‌ని శంక‌ర్ ఆరాట‌ప‌డుతున్నాడు. కానీ ఇలా నెల‌లు నెల‌లు విడుద‌ల తేదీని వెన‌క్కి పంపిస్తే నిజంగానే హిస్ట‌రీలో అతి ఎక్కువ సార్లు సినిమా విడుద‌ల తేదీని మార్చిన వ్యక్తిగా రికార్డుల‌కెక్కిపోతాడేమో శంక‌ర్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English