ఆ పార్టీలో ఇంటిలిజెంట్ భయపడ్డాడట

ఆ పార్టీలో ఇంటిలిజెంట్ భయపడ్డాడట

సాయి ధరం తేజ్ లేటెస్ట్ మూవీ ఇంటెలిజెంట్ వచ్చింది.. దాదాపు వెళ్లిపోయింది కూడా. ఇంకా కొన్ని థియేటర్లలో సినిమా ఆడుతున్నా.. అదేమీ చెప్పుకోదగ్గ విషయం కాదు. తేజు కెరీర్ లోనే గుర్తు చేసుకోకూడనంత షాక్ ఇచ్చిన సినిమాగా నిలిచిపోయింది ఇంటెలిజెంట్.

దీని నుంచి బయటపడేందుకు సాయిధరం బాగానే ట్రై చేస్తున్నాడు. రీసెంట్ గా అనుపమా పరమేశ్వరన్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. కానీ ఈ వేడుకలను ఈ హీరోనే దగ్గరుండి జరిపించాడని టాక్. అసలు ఈ ఈవెంట్ నిర్వహించాలనే ఆలోచన కూడా ఇతడిదేనట. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు లెండి. అందుకే తన హీరోయిన్ కోసం ఇంతటి ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఈ ఫంక్షన్లో ఎవరన్నా ఇంటిలిజెంట్ గురించి అడుగుతారేమోనని తెగ కంగారు పడ్డాడట సాయిధరమ్ తేజ్.

ఇంటెలిజెంట్ ఫ్లాపు గురించి మర్చిపోవాలని ఓ పార్టీ ఏర్పాటు చేస్తే.. అందులో మళ్లీ దాని గురించిన ప్రస్తావన ఎక్కడ వస్తుందో అని టెన్షన్ అన్నమాట. అంతవరకూ ఓకే కానీ.. ఓ సినిమా రిలీజ్ అయిన 10 రోజులకే.. దాని గురించి అసలు గుర్తు చేసుకోకూడదని ఆ సినిమా హీరోనే అనుకుంటుంటే.. అదెంత పెద్ద షాక్ ఇచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English