ఆ ఎఫైర్ రూమర్లపై రాశి మాటిది..

ఆ ఎఫైర్ రూమర్లపై రాశి మాటిది..

హీరోయిన్లకు మామూలుగా హీరోలతో ఎఫైర్ అనే వార్తలొస్తుంటాయి. కథానాయికకు, దర్శకుడికి మధ్య ప్రేమాయణం అంటూ వార్తలు రావడం అరుదే. ఐతే రాశి ఖన్నా విషయంలో ఇలాంటి ప్రచారమే జరిగింది. రాశి కథానాయికగా నటించిన ‘సుప్రీమ్’ సినిమా తీసిన దర్శకుడు అనిల్ రావిపూడితో ఆమెకు ముడిపెడుతూ రూమర్లు పుట్టించారు.

‘సుప్రీమ్’ తర్వాత అనిల్ తీసిన ‘రాజా ది గ్రేట్’లో రాశి ఉచితంగా ఒక స్పెషల్ సాంగ్ చేయడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. దీనిపై ఇంతకుముందెన్నడూ మాట్లాడని రాశి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. ఇవి స్టుపిడ్ రూమర్స్ అని అంది.

అనిల్ రావిపూడి తనకు మంచి స్నేహితుడని.. ‘సుప్రీమ్’లో తనకు చాలా మంచి పాత్ర ఇచ్చి గుర్తింపు వచ్చేలా చేశాడని.. ఆయన కోసం.. అలాగే తన మరో ఫ్రెండు రవితేజ కోసం ‘రాజా ది గ్రేట్’లో స్పెషల్ సాంగ్ చేశానే తప్ప అంతకుమించి ఏమీ లేదని ఆమె అంది. ఇలాంటి రూమర్లు ఎలా పుడతాయో తెలియదని అంది. తమ మధ్య ఏమైనా ఉంటే ఏదనా రాసినా ఓకే అని.. కానీ అసలేమీ లేకుండా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారో అని రాశి ఆశ్చర్యపోయింది.

తాను కూడా ఒక తల్లికి బిడ్డనే అని.. మామూలు అమ్మాయినే అని.. ఇలాంటి వార్తలు చదివినపుడు బాధపడతానని ఆమె అంది. తాను ఇప్పటిదాకా ఎవరినీ ప్రేమించలేదని ఆమె చెప్పింది. ఐతే కాలేజీలో చదివినపుడు తన సీనియర్ ఒకరు ప్రేమ లేఖ రాశారని.. అది తీసుకెళ్లి తన తల్లికి చూపించానని రాశి వెల్లడించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు