జీఎస్టీ నేను డైరెక్ట్ చేయలేదని అనలేదు

జీఎస్టీ నేను డైరెక్ట్ చేయలేదని అనలేదు

పోర్న్ స్టార్ మియా మాల్కోవాను పెట్టి తాను తీసిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ విషయంలో చెలరేగిన వివాదంతో రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలకు వర్మ పొంతన లేని సమాధానాలిచ్చినట్లుగా పోలీసుల మాటల్ని బట్టి అర్థమైంది.

తాను ‘జీఎస్టీ’ని డైరెక్ట్ చేయలేదని వర్మ పోలీసులతో అన్నట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులే వెల్లడించినట్లు కూడా అన్ని మీడియాల్లోనూ వార్తలొచ్చాయి. దీంతో వర్మ ఇఇలా దిగజారిపోయాడేంటన్న చర్చ మొదలైంది.

‘జీఎస్టీ’ తీసింది వర్మ అని అందరికీ తెలుసు. ఆయన కూడా అదే విధంగా ప్రచారం చేసుకున్నాడు. మరి మధ్యలో ఈ యు-టర్న్ ఏంటబ్బా అనుకున్నారంతా. ఐతే తాను ‘జీఎస్టీ’ తీయలేదని అన్నట్లుగా వస్తున్న వార్తల్నీ అబద్ధమే అంటున్నాడు వర్మ. తాను అన్నది ‘జీఎస్టీ’ తీయలేదని కాదు అని.. ఈ సినిమా ప్రొడక్షన్, టెక్నికల్ ప్రాసెస్ విషయంలో మాత్రమే తనకు బాధ్యత లేదని చెప్పానని.. ఈ సినిమా తీసింది తానే అని క్రెడిట్ వేసుకున్నాక కాదని ఎలా అంటానని వర్మ ప్రశ్నించాడు.

మరి వర్మ మాటలు మరో రకంగా మీడియాలోకి ఎందుకొచ్చాయి? పోలీసులు వర్మ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని మీడియాకు అలా సమాచారం ఇచ్చారా..? లేక మీడియా వాళ్లు పోలీసుల మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు