అమైరా పరిస్థితి అంతేనా??

అమైరా పరిస్థితి అంతేనా??

కొంతమంది హీరోయిన్లు యావరేజ్ బ్యూటీలుగా ఉంటారు. కాని వారిని ఆఫర్ల మీద ఆఫర్లు తెగ వచ్చేస్తుంటాయి. అలా వచ్చేసి వారు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు కూడా అయిపోతుంటారు. ఒక్కోసారి కొంతమంది స్ర్టగుల్ అవుతున్న యంగ్ బ్యూటీలను చూస్తుంటే.. అరె ఈమెకు ఏం తక్కువ.. ఎందుకు స్టార్ కాలేకపోతోంది అనే ఫీలింగ్ మనకు రావడం సహజం.

ప్రస్తుతం హీరోయిన్ అమైరా దస్తూర్ ను చూస్తే అందరికీ అదే ఫీలింగ్ కలుగుతోందని చెప్పాల్సిందే. అమ్మడు చాలా అందంగా ఉంటుంది. నవ్వితే నెలవెంక సైతం గలగలమంటుంది. అందాలను ఆరబోయడంలో కూడా ఆమెకు ఆమే సాటి. అయితే ఈ సుందరాంగి 'మనస్సుకు నచ్చింది' సినిమాతో టాలీవుడ్లో మరో పంచ్ ను తినేసిందనే చెప్పాలి. గతంలో పూరి జగన్ రోగ్ సినిమాలో హీరోయిన్ గా ఓ నాలుగు రోజులు చేసి తప్పుకుంది. తరువాత రాజ్ తరుణ్‌ తో ఒక సినిమా చేసినా కూడా.. ఆ సినిమా ఇంకా రిలీజవ్వలేదు. ఇప్పుడేమో సందీప్ కిషన్ తో ఇలా ఒక సినిమా చేస్తే.. అది డిజాష్టర్ అయ్యింది. మరి టాలీవుడ్లో ఈమె నిలదొక్కుకునేది ఎలా?

బాలీవుడ్ లో తమిళంలో కూడా సినిమాలు చేసిన అమైరా.. అక్కడ కూడా పెద్దగా ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఇక్కడ ప్రూవ్ చేసుకోవడం వంటిది ఉండదులే కాని.. యాక్టింగ్ సరిగా  భామలు కూడా స్టార్లు అయ్యారంటే.. అందుకు కారణం వారి వెనుకున్న హిట్ సినిమాలే. అమైరాకు అదొక్కటే లేదు. అయ్యో బ్యాడ్ లక్ కదూ!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు