మై మద్రాస్ అంటోన్న బన్నీ

మై మద్రాస్ అంటోన్న బన్నీ

ప్రతి ఇండస్ట్రీలో ఒక స్టైలిష్ స్టార్ ఉంటాడు. అలాగే మన టాలీవుడ్ లో కూడా బన్నీ ఎప్పటి నుంచో ఆ క్రెడిట్ అందుకుంటున్నాడు. అలాగే సౌత్ స్టైలిష్ స్టార్ అని కూడా ఈ మధ్య జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అభిమానులకు తనకు మధ్య కెమిస్ట్రీ కొంచెం దూరంగా ఉందని అనుకున్నాడో ఏమో గాని బన్నీ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చాలా బిజీగా కనిపిస్తున్నాడు. ఒక్క ట్విట్టర్ అనే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా తన ఆనందాలను షేర్ చేసుకుంటున్నాడు.

ఇకపోతే రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల ద్వారా బన్నీకొన్ని విషయాలని తెలియజేశాడు. అల్లు అర్జున్ పుట్టి పెరిగింది మద్రాస్ లోనే. అక్కడే తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేశాడు. రీసెంట్ గా అక్కడికి వెళ్లిన బన్నీ చెన్నై బీచ్ ని సందర్శించాడు. అందుకు సంబందించిన పోటోలను కూడా పోస్ట్ చేసి మై మద్రాస్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే మరో రెండు భయపడే పోటోలను కూడా స్టైలిష్ స్టార్ షేర్ చేశాడు. అవి అలల ధాటికి బయటకి కొట్టుకువచ్చిన జీవాలు. ఒకటి పాము మాదిరిగా ఉన్న చేప కాగా మరొకటి రాక్షసంగా కనిపిస్తోన్న కప్పలాంటి చేపలా ఉంది.

పోటోలను చూసి అభిమానులు చాలా వెరైటీగా కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బన్నీ నా పేరు సూర్య అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ సినిమా షూటింగ్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ - పాటలకు మంచి ఆధారణ దక్కింది. అంచనాలు కూడా బాగానే పెరిగాయి. సమ్మర్ ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నాడు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు