చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న? మోడీ..మా రాష్ర్టానికి రావ‌ద్దు

చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న? మోడీ..మా రాష్ర్టానికి రావ‌ద్దు

బీజేపీ-టీడీపీల మైత్రిలో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు మాట‌ల యుద్ధం అన్న‌ట్లుగా సాగిన రెండు ప‌క్షాల మైత్రిలో మ‌రో స్ప‌ష్ట‌మైన చీలిక క‌నిపించింది. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి మోడీనే రాష్ర్టానికి రాన‌వ‌స‌రం లేద‌ని తెలుగుదేశం ర‌థ‌సార‌థి, ఏపీ సీఎం చంద్ర‌బాబు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు ప‌రోక్షంగా చెప్పేశారు. అదికూడా ప్ర‌ధాని కార్యాల‌యం అడిగిన‌ప్ప‌టికీ ఏపీ నో చెప్ప‌డం గ‌మ‌నార్హం.

కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్న విషయం తెలిసిందే.  కేంద్ర బడ్జెట్ విషయంలో చంద్రబాబు ప్రధాని మోడీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ కారణంగానే మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడిని పెంచారు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌న టోన్ పెంచింది. ఎంపీల రాజీనామాల‌కు సై అని ప్ర‌క‌టించింది. మ‌రోవైపు విభజన హామీల సాధనతో పాటు బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సారథ్యంలోని జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రెండు రోజులపాటు చర్చించింది.

ఇలా పొలిటిక‌ల్ హీట్ కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే..పీఎంఓ ఆఫీస్ నుండి ఏపీకి ఫోన్ కాల్ వచ్చింది. ఏపీలో ఏదైనా ప్రాజెక్ట్, భవనం, ముఖ్య‌మైన ప‌థ‌కం  ఓపెనింగ్ కు రావడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నార‌ని పీఎంఓ అధికారులు తెలిపారు. అయితే దీనికి ఏపీ అనూహ్య ట్విస్ట్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ప్రధానిపై గుర్రుగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు త‌న‌దైన శైలిలో స‌మాచారం ఇప్పించార‌ట‌. అలాంటి ప్ర‌ముఖ కార్య‌క్ర‌మాలు ఇప్పుడు లేవ‌ని, మోడీ స్థాయి నేత వ‌చ్చి ఏపీలో ప్రారంభించే కార్య‌క్ర‌మాలు లేవ‌ని క‌రాఖండిగా పీఎంవోకి తెలిపిన‌ట్లు స‌మాచారం. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి రావొద్దనుకుంటుండటం వ‌ల్లే..బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య ఈ ప్రచ్ఛ‌న్న యుద్ధం ఎక్క‌డికి దారితీస్తుందో మ‌రి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు