రష్మిని జీఎస్టీ-2లో నటిస్తావా అనడిగితే..

రష్మిని జీఎస్టీ-2లో నటిస్తావా అనడిగితే..

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అంటూ పోర్న్ స్టార్ మియా మాల్కోవాను పెట్టి రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా జీఎస్టీ-2 కూడా తీస్తానని ప్రకటించాడు వర్మ. ఐతే వర్మ ఇది కూడా మియాతోనే తీస్తాడా.. లేదా వేరే పోర్న్ స్టార్ కోసం ట్రై చేస్తాడా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

వర్మకు ఎంతో ఇష్టమైన సన్నీ లియోన్‌ను పెట్టి ఈ సినిమా తీస్తే బాగుటుందన్న సలహాలు కూడా వినిపించాయి. మరి వర్మ మదిలో ఏముందో ఏమో? ఐతే ఈ లోపు యాంకర్ కమ్ యాక్టర్ రష్మి గౌతమ్‌ జీఎస్టీ-2లో నటిస్తుందంటూ ఒక చిత్రమైన ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. ఇందుకు కారణం లేకపోలేదు.

అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా మీరు వర్మ జీఎస్టీ-2లో నటిస్తారా అని అడిగితే.. నేను జీఎస్టీ-2లో నటించను.. జీటీ-2లో అయితే నటిస్తా అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇక్కడ జీటీ అంటే ‘గుంటూరు టాకీస్’ అని అర్థం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె జీటీ-2 అంటే ఎవరో దాన్ని జీఎస్టీ-2గా ప్రచారం చేశారు సోషల్ మీడియాలో.

రష్మి తాజాగా మరోసారి అభిమానులతో చిట్ చాట్ చేయగా.. మీరు జీఎస్టీ-2లో నటించడానికి ఒప్పుకున్నారటగా.. ఏంటి మీ ధైర్యం అంటూ ప్రశ్నించాడు ఒక వ్యక్తి. దీనికి రష్మి బదులిస్తూ.. నేను జీఎస్టీ-2లో నటిస్తానని ఎప్పుడన్నాను..? నేను చెప్పింది జీటీ-2.. అది కూడా ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తేనే చేస్తా అని క్లారిటీ ఇచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు