మళ్లీ రామ్‌ చరణ్‌తోనే సందడి స్టార్ట్‌

మళ్లీ రామ్‌ చరణ్‌తోనే సందడి స్టార్ట్‌

ఫిబ్రవరిలో సినిమాలు పెద్దగా ఆడవనేది మళ్లీ రుజువు అవుతోంది. హిట్‌ టాక్‌తో కూడా తొలిప్రేమ చిత్రం మామూలు వసూళ్లే తెచ్చుకుంటోంది. జనవరిలో పెద్ద సినిమాలున్నాయని ఫిబ్రవరిలో చాలా చిత్రాలు రిలీజ్‌ చేయడంతో టాలీవుడ్‌కి పెద్ద దెబ్బే తగిలింది.

ఛలో, తొలిప్రేమ తప్ప ఇంతవరకు రిలీజ్‌ అయిన ఫిబ్రవరి సినిమాల్లో ఏవీ ఆదరణకి నోచుకోలేదు. దీంతో ఇక ఫిబ్రవరి లాస్ట్‌ వీక్‌ నుంచి మార్చి నెలాఖరు వరకు సినిమా సందడి తగ్గనుంది. మరీ ఇలా వారానికి మూడు, నాలుగు కాకుండా ఒకటీ, రెండు చిన్న సినిమాలు మాత్రం రిలీజ్‌ అవుతాయి.

అయితే రియల్‌ బాక్సాఫీస్‌ సందడి మాత్రం చరణ్‌ 'రంగస్థలం'తోనే స్టార్ట్‌ అవుతుంది. మార్చి 30న విడుదలయ్యే ఈ చిత్రమే ఈ వేసవికి ఓపెనింగ్‌ బాధ్యతలు తీసుకుంది. నా పేరు సూర్య, భరత్‌ అనే నేను వగైరా భారీ చిత్రాలు వున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మళ్లీ సందడి మొదలు పెట్టేది రంగస్థలమే.

సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తోన్న ఈ వెరైటీ ప్రేమకథా చిత్రం ఇప్పటికే ఇంటర్నెట్‌లో మంచి బజ్‌తో హల్‌చల్‌ చేస్తోంది. రామ్‌ చరణ్‌కి చాలా కాలంగా దక్కని ఆ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ ఈ చిత్రంతో దొరుకుతుందా లేదా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు