మహేష్‌ తర్వాత నానికే అంత ఫాలోయింగ్‌

మహేష్‌ తర్వాత నానికే అంత ఫాలోయింగ్‌

ఓవర్సీస్‌ మార్కెట్‌లో మహేష్‌ ఎంతటి స్టార్‌ అనే దానికి కొత్తగా డిస్కషన్లు అక్కర్లేదు. అతని సినిమాలకి అక్కడ గ్యారెంటీ ఆడియన్స్‌ వుంటారు. మరీ డిజాస్టర్‌ అయిన సినిమాలు తప్ప మహేష్‌ యావరేజ్‌ చిత్రాలు కూడా ఓవర్సీస్‌లో బాగా పే చేస్తాయి.

మహేష్‌ తర్వాత ఈ మార్కెట్‌లో అంత సాలిడ్‌గా, స్టాండర్డ్‌గా కనిపిస్తోంది నాని ఒక్కడే. సూపర్‌స్టార్ల స్థాయిలో కాకపోయినా కానీ ఓవర్సీస్‌ ప్రేక్షకులకి నాని పట్ల ఒక విధమైన సాఫ్ట్‌ కార్నర్‌ వుంది. అతని సినిమాలు కుటుంబ సమేతంగా చూడవచ్చుననే నమ్మకం ఏర్పడింది. దీంతో నాని అసోసియేట్‌ అయిన అన్ని సినిమాలకీ ఓవర్సీస్‌లో వసూళ్లు బాగా వస్తున్నాయి.

అతను నిర్మించిన 'అ' చిత్రానికి హైదరాబాద్‌ మినహాయిస్తే మరెక్కడా చెప్పుకోతగిన వసూళ్లు లేవు. కానీ ఓవర్సీస్‌లో మాత్రం ఈ చిత్రం చాలా బాగా పే చేస్తోంది. కేవలం నాని నిర్మించాడంటే ఇందులో ఖచ్చితంగా ఏదో వుండే వుంటుందనే నమ్మకమే వారిని థియేటర్ల వైపు నడిపిస్తోంది.

నాని నటించిన సినిమాలు కూడా నైజాం, ఓవర్సీస్‌లో బ్రహ్మాండంగా ఆడేస్తున్నాయి. మిగతా చోట్ల ఎలా వున్నా కానీ ఈ రెండు ప్రాంతాల్లో నానికి తిరుగులేదని తేలిపోయింది. మహేష్‌ స్ట్రాంగెస్ట్‌ ఏరియాలు కూడా ఇవి రెండే కావడం గమనార్హం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు