కిరాక్ పార్టీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరాక్ పార్టీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ నెల తొమ్మిదో తారీఖే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది 'కిరాక్ పార్టీ' సినిమా. నెల రోజుల కంటే ముందే ఈ డేటుకి బెర్తు బుక్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న ప్రకారం సాగకపోవడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ వాయిదా సంగతి కూడా చాలా ఆలస్యంగా ప్రకటించారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ గురించి ఎంలాంటి వార్తా బయటికి రాలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తారట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయట. నిఖిల్ రెండు రోజుల కిందటే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చేసిందని.. త్వరలోనే ప్రకటిస్తామని ట్వీట్ చేశాడు. ఈ రోజు లేదా రేపు 'కిరాక్ పార్టీ' రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించే అవకాశముంది.

వచ్చే వారానికి చెప్పుకోదగ్గ ఏ సినిమా షెడ్యూల్ కాలేదు. నాగశౌర్య 'కణం' రావాల్సి ఉన్నా.. అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. మామూలుగా ఫిబ్రవరి మూడో వారం నుంచి ఒక నెల పాటు అన్ సీజన్‌గా పరిగణిస్తారు. స్టూడెంట్స్ అందరూ పరీక్షల హడావుడిలో మునిగిపోయి ఉంటారు కాబట్టి సినిమాలకు పెద్దగా రారు. ఇలాంటి సమయంలో ఒక యూత్ ఫుల్ మూవీని రిలీజ్ చేయడమంటే సాహసమే. ఐతే మార్చి నెలాఖరు నుంచి భారీ సినిమాల సందడి మొదలవుతుంది. రెండు మూడు నెలల పాటు డేట్ దొరకడం కష్టం.

ఇప్పుడు అన్ సీజనే అయినప్పటికీ సోలో రిలీజ్‌కు అవకాశముంది. అంత కాలం వెయిట్ చేయడం కన్నా ఇదే బెటర్ అని భావిస్తోందట చిత్ర బృందం. శరణ్ కొప్పిశెట్టి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రానికి నిఖిల్ స్నేహితులు సుధీర్ వర్మ, చందూ మొండేటి రచనా సహకారం అందించారు. కన్నడ హిట్ మూవీ 'కిరిక్ పార్టీ'కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English