వరుణ్-తేజులకు పవన్ వార్నింగ్!

వరుణ్-తేజులకు పవన్ వార్నింగ్!

అవును.. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. ఇప్పుడు వాళ్లేం తప్పు చేశారని వార్నింగ్ ఇచ్చినట్లు అని సందేహం కలుగుతోంది కదా. ఐతే ఈ వార్నింగ్ ఇప్పుడిచ్చింది కాదు. వాళ్లు హీరోలుగా మారడానికి ముందు కొంచెం ఆవారాగా తిరుగుతున్న సమయంలో చేసిన హెచ్చరిక అది. దాని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ వెల్లడించాడు.

సాధారణంగా పవన్ చాలా తక్కువ మాట్లాడతాడని.. తమతో సినిమాల గురించి డిస్కషనే ఉండేది కాదని.. ఐతే ఒకసారి తాను.. తేజు కలిసి రాత్రి బయటికి వెళ్లి చాలా లేటుగా ఇంటికి వచ్చామని.. అప్పుడు పవన్ పిలిచి తమను హెచ్చరించాడని వరుణ్ తెలిపాడు.

'మీరు చిరంజీవి అనే పెద్ద చెట్టు నుంచి వచ్చారు. అది మిమ్మల్ని ఎప్పుడూ కాపాడదు. జీవితాన్ని సీరియస్‌గా తీసుకోండి. మీ గుర్తింపు మీదే. చిరంజీవి తమ్ముడి కొడుకువని నీ సినిమా చూసేందుకు జనాలు రారు. మీ ప్రయాణం మీదే. జాగ్రత్త' అంటూ పవన్ కొంచెం గట్టిగా చెప్పినట్లు వరుణ్ వెల్లడించాడు.

ఇక తేజుతో తన అనుబంధం గురించి వరుణ్ చెబుతూ.. ''మా కుటుంబంలో ఏదైనా మంచి చేయాలనుకుంటే తేజునే ముందుంటాడు. నా విషయానికి వస్తే అతను ముందు వెనుక చూడడు. మేమిద్దరం మంచి స్నేహితులం. మా కుటుంబం మొత్తంలో అందరి కంటే మంచోడు తేజునే అని అందరి అభిప్రాయం. నేను తేజు కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుందన్నది నా ఫీలింగ్. మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాం'' అని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు