దెబ్బకి సన్నీ పళ్ళు ఊడిపోయాయ్

దెబ్బకి సన్నీ పళ్ళు ఊడిపోయాయ్

శృంగార తార సన్నీ లియెన్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఈ రోజుల్లో కుర్రకారు ఓ లుక్కేయకుండా ఉండలేకపోతున్నారు. అందుకు సన్నీ కూడా ఒక కారణమే. ఎందుకంటే అమ్మడు ఇచ్చే కిక్ లు ఆ విధంగా ఉంటాయి మరి. ఫొటో అయినా వీడియో క్లిప్ అయినా విషయం ఎలాంటిదైనా సన్నీ లుక్కులో కొత్త దనం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ ప్రపంచంలో ఆమె అందం గురించి తెలియని వారు ఉండరు.

ఇక అసలు విషయానికి వస్తే.. సన్నీ అందంలోనే కాకుండా నటనాపరంగా తనని తాను నిరూపించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. గత కొంత కాలంగా నటనకు ప్రాధాన్యత ఉన్న కథలనే అమ్మడు ఒకే చేస్తోంది. రీసెంట్ గా సన్నీకి సంబందించిన ఒక ఫొటోని చుస్తే ఆమె ఎంతగా కష్టపడుతుందో అర్ధమవుతోంది. అంతే కాకుండా భయాన్ని కూడా రేపుతోంది. చూసిన వారందరు ఎందుకు సన్నీ ఇలా బయపెడుతున్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ ఫొటో ఎక్కడిదా అని ఆరాతీస్తే ఒక పాటకు సంబంధించినదని తెలుస్తోంది. గత మూడు రోజులుగా సన్నీ గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటోంది. బ్లూ స్క్రీన్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరిస్తున్నారు. పాట పూర్తయిన తరువాత VFX  యాడ్ చేయనున్నారు. ఇక ఆ విజువల్స్ పూర్తయ్యాక చుస్తే మొన్నటి వరకు సన్నీ అందాలను చూసి ఇష్టపడిన వారు ఆమె ఇప్పుడు చేస్తోన్న ప్రయోగం బయపెడుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అలాగే దెబ్బకి ఆమె పళ్ళన్నీ ఊడిపోయాయ్ అని కూడా జనాలు జోకులేస్తున్నారు. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు