ఈ మూమెంట్ లో పంచులేంటి వర్మ?

ఈ మూమెంట్ లో పంచులేంటి  వర్మ?

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా జీఎస్టీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కాదు కాదు చాలా పబ్లిసిటి ని తెచ్చుకుంటున్నాడు. ఆయనకు పబ్లిసిటి ఎంత అందితే అంత ఆనందం. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇక నేడు సీసీఎస్ విచారణలో వర్మ జీఎస్టీ కి సంబందించిన ప్రశ్నలను ఎదుర్కొన్నాడు అంతే కాకుండా మహిళలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడనే విషయం పై పోలీసులు విచారణ జరిపారు.

అందరు ఈ మ్యాటర్ చాలా సీరియస్ అవుతుందని అంటున్నారు. మహిళా సంఘాలు కూడా చాలా సిరియస్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో వర్మని వదల కూడదని అంటున్నారు. అయితే ఎన్ని జరుగుతున్నా ఏ విధమైన ఆరోపణలు వస్తున్నప్పటికీ వర్మ తన చిలిపి చేష్టలలో ఏ మాత్రం తేడా రాకుండా ట్విట్టర్ లో స్పందిస్తూనే ఉన్నాడు. దాదాపు మూడు గంటల పాటు జరిపిన విచారణ అనంతరం బయటకీ వచ్చిన వర్మ నడుచుకుంటూ వస్తోన్న ఒక ఫొటోని పోస్ట్ చేశాడు.

నాకు పోలీస్ ఆఫీసర్స్ పాత్రలో నిజంగా నటించాలని ఉంది. సో దర్శకులకు నా రిక్వెస్ట్.. ప్లీజ్ దయచేసి నన్ను కలవండి అంటూ ట్వీట్ చేశాడు. ఓ పక్క అన్ని జరుగుతుంటే ఈ పంచులు ఏంటి బాబు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే దానికి బదులుగా అయన శిష్యుడు పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ రెడీ సార్.. డేట్స్ కోసం వెయిటింగ్ అనేశాడు. వర్మ కూడా థ్యాంక్యూ సర్ అని తనదైన శైలిలో స్పందించాడు.   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు