రాజమండ్రిలో టర్నింగ్ తిరిగిన సమంత

రాజమండ్రిలో టర్నింగ్ తిరిగిన సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తరువాత చాలా మారిపోయింది. ఎవరైనా సరే పెళ్లి తరువాత సినిమాలను తగ్గించేస్తారు. కానీ సమంత మాత్రం అందుకు డిఫెరెంట్ గా సినిమాల సంఖ్యను పెంచేసింది. ఎదో సాధారణంగా కమర్షియల్ సినిమాలను చేస్తోంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అక్కినేని వారి కోడలు చాలా వినూత్న కథలను ఎంచుకుంటోంది. గత కొంత కాలంగా సమంత ఒక కన్నడ సినిమాను రీమేక్ చేయాలనీ చూస్తోంది.

కన్నడలో సూపర్ హిట్ అయిన యూ టర్న్ అనే మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ ను మొదటి సారి చూడగానే అమ్మడు చాలా ఫిదా అయిపొయింది. అయితే గత ఏడాది నుంచి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనీ అనుకుంటోంది. ఇక ఫైనల్ సినిమా స్క్రిప్ట్ ను మొత్తం ఇక్కడి టెక్నీషియన్స్ తో తెలుగుకు తగ్గట్టుగా రెడీ చేసుకొని మళ్లీ సరికొత్తగా తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. మొదటి షెడ్యూల్ ని రాజమండ్రిలోని ఒక బిల్డింగ్ లో స్టార్ట్ చేశారు.

అయితే సమంత వచ్చిందని తెలుసుకున్న చాలా మంది అక్కడికి వచ్చారు. అయితే అభిమానుల ప్రేమను చూసి సమంత ఎంతో ఆనందపడింది. అందరి వైపు చూసి చేయి ఊపింది. అందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సమంత తన ఆనందాన్ని తెలియజేసింది. ఇక సినిమాను ఒరిజినల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు పవన్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. మరి సమంత యూ టర్న్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు