మళ్ళీ తన సినిమాకు తానే పొడ్డూసరు

మళ్ళీ తన సినిమాకు తానే పొడ్డూసరు

యంగ్ హీరో నాగ శౌర్య ఒక చిన్న బ్రేక్ తర్వాత రే-ఎంట్రీ ఇచ్చి చలో సినిమా తో సూపర్ హిట్ కొట్టాడు. రెండు రాష్ట్రాల మధ్య బోర్డర్ లో జరిగే కొన్ని సందర్భాల్లో కామెడీ పుట్టించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శౌర్య ఇప్పుడు ఇంకో కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధం అయ్యాడు.

చలో సినిమా ని శౌర్య నే స్వయానా తన హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ ఇరా క్రియేషన్స్ తో నిర్మించడం విశేషం. వెంకీ కుడుమల దర్శకత్వంలో వచ్చిన చలో సినిమా కన్నడ బ్యూటీ రష్మీక మందన ని కూడా టాలీవుడ్ కు పరిచయం చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఆ సక్సెస్ ఇచ్చిన ధైర్యం కావచ్చు శౌర్య మళ్ళీ యన సినిమాను తానే నిర్మిద్దాం అనుకుంటున్నాడు. ఈ ఒక మనసు హీరో ఇప్పుడు నర్తన శాల అనే ఒక సినిమా సైన్ చేశాడు. ఈ సినిమాతో కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడు. మార్చ్ లో షూటింగ్ మొదలు అవబోతున్న ఈ సినిమా ను కూడా శౌర్య నే ఇరా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.

ఇవే కాకుండా ఇంకా రెండు సినిమాలు ఇతని చేతిలో ఉన్నాయి. అయినా మొదటి సినిమా హిట్ అయింది కాబట్టి సరిపోయింది.. మరిప్పుడు రెండో సినిమా ప్లాప్ అయితే అప్పుడు సంగతేంటి? ఇలా తన సినిమాలు తానే నిర్మించుకుంటూ పోతే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఇంకా ఈ యంగ్ హీరోను పట్టించుకుంటారు అంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు