ప్రియ ప్రకాష్ కు ముఖ్యమంత్రి మద్దతు

ప్రియ ప్రకాష్ కు ముఖ్యమంత్రి మద్దతు

కేవలం ఒక ఐదు సెకండ్ల వీడియో కూడా సెన్సేషన్ క్రియట్ చేయగలదు అని, అందులో వాళ్ళని స్టార్లు చేసేస్తుంది అని ఈమధ్యనే ప్రూవ్ అయ్యింది. రాబోతున్న మలయాళం సినిమా ఓరు అడార్ లవ్ అనే సినిమాలో ఒక పాట లో హీరోయిన్  హీరోను చూసి కన్ను గీటే ఆ వీడియో ఒక సెన్సేషన్ సృష్టించింది. అందులో హీరోయిన్ ప్రియ ప్రకాష్ ను స్టార్ ను చేసేసింది.

కానీ పాపులారిటీ వెనకే కాంట్రవర్సీ కూడా రావడం సహజమే కదా. ఈ పాట ముస్లింల మనోభావలని దెబ్బ తీసేవిధంగా ఉంది అని కొందరు ముస్లిం యువత ప్రియ ప్రకాష్ పై ఫలక్ నామ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పాట లో లిరిక్స్ వాళ్ళ ప్రోఫెట్ మొహమ్మద్ ను అతని భార్యను అవమానించేలా ఉన్నాయ్ అన్నది వారి ఆరోపణ. ఈ విషయమై కేరళ ముఖ్యమంత్రి  పినరయి విజయన్ రియాక్ట్ అయ్యారు. ఈ పాటను గత కొన్ని దశాబ్దాలుగా ముస్లిం పెళ్లిళ్లలో పాడుతున్నారు అంటూ ప్రియ ప్రకాష్ కు సపోర్ట్ చేశారు. ఆయన ఫేసుబుక్ లో ఈ విధంగా అన్నారు.

"ఈ వివాదం మనకు.. సంప్రదాయవాదులకు కళలు నచ్చవు అనే విషయాన్ని గుర్తుచేస్తోంది. మాములు ప్రజలకు కళ ఇచ్చే ఆనందం వారికి అర్థం కాదు. కళ, సాహిత్యం అనేవి మతసంప్రదయాలకు, మతోన్మాదనికి వ్యతిరేకమైన రెండు ఆయుధాలు. మనం ఉదారవాద అనుచరులకు మాత్రమే అండగా ఉండాలి. ఈ విషయంలో ఎవరైనా హిందు మరియు ముస్లిం సాంప్రదాయవాదులు కలిసి కట్టుగా ఉన్నారు అని అనుమానిస్తే, వారిని మనం తప్పుపట్టలేం" అన్నారు.

రూలింగ్ పార్టీ మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ ఊరుకుంటుందా. ముందు ప్రజల క్షేమ సుఖాలు పట్టించుకోవాలని, పాటలను వాటికి సంబంధించిన గొడవలు కాదని దెప్పిపొడిచారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు