ట్రంప్ తో ఆమెకూ రిలేష‌న్ ఉంద‌ట‌

ట్రంప్ తో ఆమెకూ రిలేష‌న్ ఉంద‌ట‌

వివాదాస్ప‌దానికి నిలువెత్తు రూపంగా క‌నిపిస్తారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. ఆయ‌న మాట‌లు. చేత‌ల పుణ్య‌మా అని త‌ర‌చూ వివాదాస్ప‌ద వార్త‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తుంటారు. మ‌హిళ‌ల్ని చుల‌క‌న‌గా వ్యాఖ్యానించ‌టం మొద‌లు.. ఆయ‌న గ‌తానికి సంబంధించి సంచ‌ల‌న క‌థ‌నాలు వ‌స్తుంటాయి. ఇటీవ‌ల ఆయ‌న లైంగిక సంబంధాలు సాగించిన మ‌హిళ‌లు ఒక్కొక్క‌రిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఈ మ‌ధ్య‌నే మాజీ పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫార్ట్ అఫైర్ బ‌య‌ట‌కు రావ‌టం.. ఆ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌టానికి వీలుగా అధ్య‌క్ష ఎన్నిక‌లకు ముందు భారీ మొత్తాన్ని ముట్ట‌జెప్పిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాన్ని మొద‌ట్లో కొట్టిపారేసినా.. రెండు.. మూడు రోజుల క్రితం ట్రంప్ వ్య‌క్తి న్యాయ‌వాది అవున‌ని ఒప్పుకోవ‌టం సంచ‌ల‌న‌మైంది.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో మ‌హిళ ట్రంప్ తో త‌న‌కు లైంగిక సంబంధం ఉందంటూ బాంబు పేల్చింది. ప్లేబాయ్ మాజీ మోడ‌ల్ అయిన 46 ఏళ్ల క‌రెన్ మెక్ డౌగ‌ల్ తాజాగా ట్రంప్ తో త‌న‌కున్న బంధాన్ని బ‌య‌ట‌పెట్టింది. 2006లో ట్రంప్ త‌న‌తో సంబందాన్ని న‌డిపార‌న్నారు. ఆ సమ‌యంలో ట్రంప్ స‌తీమ‌ణి మెలానియా కొడుక్కి జ‌న్మ‌నిచ్చింద‌న్నారు. ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ట్రంప్ తో త‌న‌కున్న లైంగిక సంబంధాన్ని బ‌య‌ట‌పెట్టారు. అంతేకాదు.. 2016 అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌తో ట్రంప్ న‌డిపిన సంబంధం గురించి బ‌య‌ట పెట్ట‌కుండా ఉండేందుకు త‌న‌తో ఒప్పందాన్ని చేసుకున్నార‌న్నారు. ఆ ఒప్పందం ప్ర‌కారం 1.30ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను ఇచ్చిన‌ట్లు చెప్పారు. క‌రెన్ వ్యాఖ్య‌లు ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నంగా మారాయి.

ఇప్ప‌టికే ప‌లువురు మ‌హిళ‌ల‌తో ట్రంప్ లైంగిక సంబంధాలు క‌లిగి ఉన్న విష‌యం బ‌య‌ట‌కు రాగా.. ఇప్పుడో మ‌రో మాజీ మోడ‌ల్ కూడా ఈ జాబితాలో చేరిన‌ట్లైంది. ఎన్నిక‌ల వేళ‌లో త‌న ఘ‌న‌కార్యాల గురించి బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు డ‌బ్బులు ఇవ్వ‌టం నైతిక‌త‌కు సంబంధించిన విష‌యంగా ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.ఈ వ్య‌వ‌హారంపై స్పందించేందుకు వైట్ హౌస్ నిరాక‌రించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English