మెగా హీరోల మీద చిరుకి చాలా భయం

మెగా హీరోల మీద చిరుకి చాలా భయం

మెగాస్టార్ చిరంజీవి.. డాన్స్ అయినా, పెర్ఫార్మెన్స్ అయినా, ఫైట్స్ అయినా ఆయన తర్వాతే ఎవరైనా. ఆయనకున్న క్రేజ్ మరెవ్వరికి లేదు రాదు కూడా. చిరు ఫామిలీ టాగ్ తో చాలా యువ హీరోలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీ లో బోలెడంత స్టార్డమ్ సంపాదించారు. మరి వాళ్ళ మీద చిరు కు ఎంత వరకు నమ్మకం ఉంది?

చిరు తన ఫామిలీ నుండి వచ్చిన హీరోలు డాన్స్ ఎలా చేస్తారో అన్న భయం ఉండేది అంట. ఎందుకంటే డాన్స్ లో చిరు కు సాటి లేరు. ఆయన ఫ్యామిలీ అంటే ప్రేక్షకులు అదే రేంజ్ లో డాన్స్ కోసం చూస్తారు. మరి వాళ్ళ అంచనాలకు మెగా హీరోలు అందుతారా లేదా అని భయం ఉండటం సహజమే. ముఖ్యంగా చరణ్ విషయం లో కూడా అలానే భయపడే వాళ్లంట. ఆ విషయం స్వయానా డాన్స్ మాస్టర్ అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఏ బయట పెట్టారు.

ఆయన దాయి దాయి దామ సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేసేప్పుడు రాం చరణ్ అక్కడే ఉండటంతో అతనితో డాన్స్ చేయించమని లారెన్స్ కు చేప్పారంట చిరు. చరణ్ డాన్స్ ఎలా చేస్తాడో అని చిరు చాలా టెన్షన్ పడేవారని, కానీ అతని డాన్స్ చూసిన తాను చరణ్ చాలా బాగా చేసాడు అని చిరు కు చెప్పారట. మొన్నటికి మొన్న తొలి ప్రేమ సినిమా సక్సెస్ మీట్ లో కూడా, చిరునే అన్నారు. "ఈ పర్సనాలిటీ కి హైట్ కి డాన్స్ చేయగలడా అని బయమేసేది కానీ చాలా బాగా చేశాడు (వరుణ్ తేజ్ ని ఉద్దేశించి)" అని మెగాస్టార్ అన్నారు.

చూస్తుంటే నిజంగానే చిరంజీవి గారికి తన కుటుంబం నుండి వచ్చిన హీరోలు డాన్స్ ఎలా చేస్తారా, ఫాన్స్ నమ్మకాన్ని తన నమ్మకాన్ని వమ్ము చేస్తారేమో అన్న భయం కనిపిస్తోంది. కానీ ఆ భయం అవసరమా చెప్పండి? ఎందుకంటే మెగా హీరోలు కూడా చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరి హీరోలు కంటే వాళ్ల డాన్స్ లో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది మన అందర్నీ ఆకర్షిస్తూనే ఉంటుంది. కదా?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు