ఆ రైటర్ మాటలు ఎవరినుద్దేశించి..?

ఆ రైటర్ మాటలు ఎవరినుద్దేశించి..?

చాలా తక్కువ సమయంలో రచయితగా గొప్ప పేరు సంపాదించాడు సాయిమాధవ్ బుర్రా. ‘కృష్ణం వందే జగద్గురుం’.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. ‘ఖైదీ నంబర్ 150’ లాంటి సినిమాలతో మాటల రచయితగా ఆయన తనదైన ముద్ర చూపించారు.

కేవలం మాటలు రాయడంతో పాటు చాలామంది స్క్రిప్ట్ కన్సల్టంట్‌గా ఆయన్ని సంప్రదిస్తున్నారిప్పుడు. అలాంటి రైటర్‌ను దర్శకురాలిగా తన తొలి సినిమాకు తీసుకుంది కృష్ణ కూతురు మంజుల. ఐతే సినిమా చూస్తే సాయిమాధవ్ ముద్ర పెద్దగా కనిపించలేదు. పైగా సినిమా ప్రమోషన్లలో కూడా బుర్రా కనిపించింది లేదు.

దీంతో బుర్రాకు.. మంజులకు ఏమైనా చెడిందేమో అన్న గుసగుసలు సినిమా విడుదలకు ముందే వినిపించాయి. ఈ సందేహాలు బలపడేలా నిన్న ఫేస్ బుక్‌లో ఒక మెసేజ్ పెట్టాడు బుర్రా.
‘‘ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. ఎవరి పని వాళ్ళ చేతే చేయించాలి’’ అనేది ఆ మెసేజ్. ఇది మంజుల మీద బుర్రా వేసిన సెటైర్ అంటూ ప్రచారం జరుగుతోంది. ‘మనసుకు నచ్చింది’ సినిమాకు సంబంధించి మంజుల తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని.. తన పనిని పక్కన పెట్టేసిందని బుర్రా కినుక వహించాడని అంటున్నారు. ప్రమోషన్లలో కూడా తాను ఇంగ్లిష్ డైలాగులు రాస్తే వాటినే బుర్రా తర్జుమా చేసినట్లుగా మంజుల వ్యాఖ్యానించడం కూడా ఆయన్ని బాధించిందట. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే పేలవమైన టాక్ వచ్చిన నేపథ్యంలో బుర్రా ఈ కామెంట్ పెట్టి మంజులకు కౌంటర్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు