బాలీవుడ్ యాక్టరే ఆమెకు ఫ్యాన్ అయ్యాడు

బాలీవుడ్ యాక్టరే ఆమెకు ఫ్యాన్ అయ్యాడు

బాలీవుడ్ లో చాలా మంది సినీ నటులు సౌత్ స్టార్స్ ని పొగడడం చాలా అరుదుగా చూస్తుంటాం. నేషనల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నా సరే ఎదో నార్మల్ గా ప్రశంసలను అందిస్తుంటారు గాని మనస్ఫూర్తిగా పొగిడినట్టు అనిపించదు. కానీ రీసెంట్ గా ఒక నటుడు మలయాళీ ముద్దుగుమ్మను పొగిడిన తీరు అందరిని ఆకర్షించింది. స్టార్ నటుడిగా గుర్తింపు పొందిన బాలీవుడ్ యాక్టర్ రిషి కపూర్ ఒక అమ్మాయికి ఫిదా అయిపోయాడు.

ఆ లక్కీ గర్ల్ ఎవరో కాదు. ప్రస్తుతం అందరి ఫోన్లలో వాల్ పేపర్ అవుతోన్న ప్రియా వారియర్. అందమంటే బికినీ వేయడం కాదు చూపుల్లో నవ్వుల్లో కూడా అంతకంటే మంచి అందం ఉంటుందని నిరూపించింది. టాప్ లెస్ స్కిన్ షో అందాలకే ఎక్కువ క్రేజ్ అందుతుందని చెప్పే వారికి ప్రియా ఒక చెప్పు దెబ్బ లాంటి సమాధానం ఇచ్చింది. ఓరు ఆధార్ లవ్ సినిమాలో నటిస్తోన్న ప్రియా ఆ సినిమా టీజర్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

అయితే రిషి కపూర్ ప్రియా వారియర్ గురించి స్పందించాడు. ఈ అమ్మాయి మంచి స్టార్ డమ్ తెచ్చుకుంటుందట. అమాయకంగా కనిపిస్తూనే చాలా మందిని ఆకర్షించింది. మై డియర్ ప్రియ నువ్వు భవిష్యత్ తరాలకు ఇప్పుడున్న వారికీ మంచి స్ఫూర్తి. ఇప్పుడున్న వారు ఎక్కువగా డబ్బు కోసం పరిగెత్తుతున్నారు. నీ కెరీర్ బావుండాలని కోరుకుంటున్నా గాడ్ బ్లేస్ యూ అని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు