అయ్ బాబోయ్ ఎంత పొడవో అంటూ చిరు..

అయ్ బాబోయ్ ఎంత పొడవో అంటూ చిరు..

టాలీవుడ్లో కొన్నేళ్ల కిందటి వరకు అత్యంత పొడవైన హీరో ఎవరు అంటే ప్రభాస్ అని చెప్పేవాళ్లు. కానీ ‘ముకుంద’ సినిమా రిలీజైన దగ్గర్నుంచి ఆన్సర్ మారిపోయింది. ప్రభాస్ కన్నా పొడవైన వరుణ్ తేజ్ ఆ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమయ్యాడు. వరుణ్ పక్కన హీరోయిన్లను సెట్ చేయడం కష్టమైపోతోంది. కొంచెం ఎత్తు తక్కువున్న హీరోయిన్లను పెడితే ఇబ్బందైపోతోంది. ‘తొలి ప్రేమ’ హీరోయిన్ రాశి ఖన్నా అతడి కంటే ఎత్తు చాలా తక్కువ. అందుకే క్లైమాక్స్‌లో వరుణ్‌కు షూలేమీ వేయించకుండా.. రాశికి మాత్రం అర అడుగు హైహీల్స్ వేయించి నిలబెడితే కానీ లిప్ లాక్ సీన్ సెట్టవ్వలేదు.

వరుణ్ హైట్ గురించి ‘ఫిదా’లోని ఒక పాటలో ‘అయ్ బాబోయ్ ఎంత పొడుగో’ అంటూ ఒక లైన్ కూడా ఉంటుంది. ఈ కుర్రాడి హైట్ గురించి చిరంజీవి సైతం ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘తొలి ప్రేమ’ టీంను అభినించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. వరుణ్ చాలా హైట్ అని.. ఆ హైటుతో డ్యాన్స్ చేయడం కష్టమని.. అతడికి డ్యాన్స్ రాదని తాను అనుకున్నానని.. కానీ ‘తొలి ప్రేమ’లో అదిరిపోయే డ్యాన్సులతో ఆకట్టుకున్నాడని అన్నాడు. ఇక ఈ వేడుక చివర్లో చిరు ‘తొలి ప్రేమ’ బృందాన్ని అభినందిస్తూ శాలువాలు కప్పగా.. వరుణ్ దగ్గరికి వచ్చేసరికి ఇబ్బందైంది. అతడి హైట్ చూసి ఆశ్చర్యపోతూ వీడికి శాలువా కప్పాలంటే నేను స్టూల్ వేసుకోవాలేమో అని చిరు అనడంతో అక్కడ అందరూ గొల్లుమన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు