నయనతార పెళ్లి వార్తల్లోకి ఎక్కింది

నయనతార పెళ్లి వార్తల్లోకి ఎక్కింది

నయనతార.. హీరో ల లోనే కాదు హీరోయిన్లలో కూడా సూపర్ స్టార్ లు ఉంటారు అనడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈమెకు తెలుగు మరియు తమిళ భాషల్లో ఎదురు లేదు. చిన్న చిన్న సినిమాలతో మొదలు పెట్టి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగి మన అందరి మనసుల్లో ఒక చెరిగిపోని ముద్ర వేసింది. అలాంటి ఈమె మనసులో ఎవరు ఉన్నారో తెలుసా?

అంతకు ముందు తమిళ హీరో అయిన శింబు తో కొన్నాళ్ల ప్రేమాయణం నడిపింది కానీ మధ్యలో లొనే విడిపోయారు. తర్వాత ప్రభు దేవా తో పెళ్లి దాకా వెళ్లిందని టాక్ ఉంది కాని ఏమైందో ఏమో అది కూడా వర్క్ ఔట్ అవ్వలేదు. ప్రస్తుతం ఈమె తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఎంత తన నోటితో బయట పెట్టకపోయినా, సోషల్ మీడియా లో ఈమె ఫోటోలు వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పకనే చెబుతున్నాయి. అయితే ఈ మధ్యన నయన తన వాట్సాప్ లో ప్రియుడు విగ్నేష్‌ తో కలసి దిగిన ఫోటోలను తెగ పెడుతోందట. వాట్సాప్ ప్రొఫైల్ పిక్ పెట్టడం.. స్టోరీస్ లో ఫోటోలు యాడ్ చేయడం వంటివి చేస్తోందట. దానితో అందరూ స్టన్ అవుతున్నారు. త్వరలోనే ఆమె పెళ్ళి అంటూ మరోసారి తమిళనాట కొత్త ఫోటోలతో పాటు పాత వార్త కూడా వైరల్ అయ్యింది.

ప్రస్తుతం ఈమె రిలేషన్షిప్ సౌత్ ఇండస్ట్రీ లొనే ఒక హాట్ టాపిక్ గా చెప్పచ్చు. నయనతార త్వరలో అతనిని పెళ్లి చేసుకోబోతోంది అని రూమర్లు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.  కానీ ఈమె అన్నిటికి చెక్ పెట్టినట్టు అజిత్ తర్వాత సినిమా విశ్వాసం లో హీరోయిన్ గా సైన్ చేసింది. అంతే కాదు. ఈమె చేతిలో కొన్ని తెలుగు మరియు తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అందాల భామ నయనతార త్వరలో పెళ్లి పీటలు ఎక్కేలా మాత్రం కనపడట్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు