సన్ని లియోన్ ను మించిపోయిన ప్రియ

సన్ని లియోన్ ను మించిపోయిన ప్రియ

రెండు మూడు సినిమాలు హిట్ కొడితే కానీ రానంత క్రేజ్‌... కేవ‌లం 26 సెక‌న్ల నిడివి ఉన్న చిన్న వీడియోతో తెచ్చేసుకుంది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. వారంరోజులుగా ఆన్‌లైన్‌లో ఆమెదే హ‌వా. సామాజిక మాధ్య‌మాల నిండా ఆమె ఫోటోలు, వీడియోలే. మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రో కూడా తెలియ‌ని అమ్మాయి ఇప్పుడు... ఎంద‌రికో ఫేవ‌రేట్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఓ విష‌యంలో స‌న్నీ లియోన్, క‌త్రినా కైఫ్‌, దీపికా ప‌దుకునే వంటి తార‌లను కింద‌కి తొక్కేసింది.

క‌లువ రేకుల్లాంటి క‌ళ్ల‌తో, విల్లులాంటి క‌నుబొమ్మ‌ల‌తో మ‌ల‌యాళ‌ స్ర్కీన్‌ను షేక్ చేసేయ‌డానికి సినిమాలో ఎంట్రీ ఇస్తోంది ప్రియా ప్ర‌కాష్‌. ఒరు అడార్ ల‌వ్ అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అందులో ఒక పాట‌లో క‌నుబొమ్మ‌ల‌తో డ్యాన్స్ చేయించి, అందంగా క‌న్ను కొట్టింది. ఆ సీన్ ఆన్‌లైన్ ను షేక్ చేసేసింది. ఆమె నవ్వుకు, చూపుకు కుర్ర‌కారు దాసోహ‌మైపోయింది. ఆమె గురించి గూగుల్ లో తెగ వెతికారు. ఆమె ఫోటోలు డౌన్‌లోడ్‌లు చేశారు. ఆమె కోసం ఎంత‌గా వెతికారంటే... ఆమెనే ఇప్పుడు ఇండియాలో మోస్ట్ సెర్చ్‌డ్ ప‌ర్స‌న్ అయ్యింది. ఇంత‌కు ముందు ఆ స్థానంలో స‌న్నీలియోన్ ఉండేది. ఆమె ఇప్పుడు రెండో స్థానానికి జారుకుంది. చూశారా... ఒక్క‌సారి క‌న్నుగీటి ప్రియా ప్ర‌పంచాన్నే త‌న వైపుకు తిప్పుకుంది. అంతెందుకు మ‌న టాలీవుడ్ స్టార్ హీరో బ‌న్నీ కూడా ఆమె వీడియోను షేర్ చేసి... క్యూట్ వీడియో అని కామెంట్ చేశాడు.

త‌న మొద‌టి సినిమా ఇంకా విడుద‌ల‌వ్వక ముందే ప్రియాకు ఈ రేంజ్‌లో క్రేజ్ రావ‌డం ఆమెను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాను అస్స‌లు ఊహించ‌లేదంటూ ఆనంద‌ప‌డుతోంది. ఈమె న‌టిస్తున్న ఒరు అడార్ ల‌వ్ జూన్ 14న విడుద‌ల కానుంది. అది హిట్ కొడితే... ప్రియా ప్ర‌కాష్ ద‌శ తిరిగిన‌ట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు