ఆ సినిమా అంత కిక్ ఇచ్చిందా?

ఆ సినిమా అంత కిక్ ఇచ్చిందా?

చాలా కాలం తరువాత మోహన్ బాబు గాయత్రీ సినిమా ద్వారా ఈ మద్యే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన గాయత్రీ సినిమా గత కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. అలాగే మంచి విష్ణు - శ్రియ కూడా ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఓ వర్గం ప్రేక్షకులను సినిమా పరవాలేదు అనే విధంగా ఆకట్టుకుంది. దీంతో చిత్ర యూనిట్ రీసెంట్ గా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.  

సక్సెస్ మీట్ లో ఎవరి స్టైల్ లో వారు స్పీచ్ ఇచ్చుకోగా కామెడీ కింగ్ బ్రహ్మానందం మాత్రం వెరైటీ గా చిత్ర యూనిట్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా మోహన్ బాబు గారిని బ్రహ్మానందం పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు. గాయత్రీ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఈ వయసులో రిస్కులు చేయాల్సిన అవసరం లేదు కానీ దెబ్బలను సైతం పక్కనపెట్టేసి ఆ సినిమాను చేశారు. ఒకరి వళ్ళ సినిమా ఆగిపోకూడదు అనే విషయం ఆయనకు బాగా తెలుసని తెలిపారు.  

ఇక సినిమా తనకు ఎంత నచ్చిందో రెండు ముక్కల్లో చెప్పేశాడు. అసలే ధియేటర్ కు వెళ్ళి నేను సినిమాలే చూడను. అలాగే ఇంట్లో కూడా చూడను. 25 ఏళ్ళు అయ్యింది సినిమాలు చూసి అని మాట్లాడుతూ.. మళ్లీ ఇన్నాళ్లకి గాయత్రి సినిమా చూశానని బ్రహ్మానందం చెప్పడంతో సినిమా అంత కిక్ ఇచ్చిందా అనే టాక్ వస్తోంది.ఇక మోహన్ బాబు పాత్ర సినిమాలో హైలెట్ అని.. ఇంకా సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English