కబాలి కాల్చింది చాలదా మాష్టారూ!!

కబాలి కాల్చింది చాలదా మాష్టారూ!!

దక్షిణ భారత ప్రేక్షకుల మనసులో చిరకాలం ఒక స్టార్ హీరో గా నిలిచి ఉండిపోయేంత గొప్పదనం కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్ సొంతం. అతని సినిమా వస్తుంది అంటే చాలు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి కొనేవారు. ఎన్ని కోట్లు అయినా సరే కళ్ళు మూసుకుని సమర్పించేస్తారు. అది రజిని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తప్పక కాసుల వర్షం కురిపిస్తుంది అని వారి నమ్మకం. అది నిజమే అనుకోండి. కానీ ఇపుడు రజిని సినిమా కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదంట.

రజినీకాంత్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి శంకర్ డైరెక్షన్ లో సూపర్ హిట్ సినిమా రోబో కు సీక్వెల్ గా తెరకెక్కబోతున్న 2 పాయింట్ ఓ. మరొకటి కాలా. ఏషియన్ ఫిలిమ్స్ 2 పాయింట్ ఓ చిత్రానికి థియేట్రికల్ రైట్స్ కు గాను 90 కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ విచిత్రం గా కాలా సినిమా ను కొనేందుకు మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు. దీని గురించి పలు కారణాలు చెప్పుకుంటున్నారు. కబాలి లాంటి డిజాస్టర్ తీసిన పా రంజిత్ ఏ మళ్ళీ కాలా సినిమా డైరెక్టర్ అవ్వడం మొదటి కారణం. నిజానికి ఈ సినిమా పై అంచనాలు పెద్దగా లేవనే చెప్పాలి. పైగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది అని గ్యారంటీ లేదు. ఇదిలా ఉండగా నిర్మాత ధనుష్ కు అసలే ఈ మధ్య ఎంచుకున్న సినిమాలు అన్ని ఫ్లోప్స్ ఏ ఎదురవుతున్నాయి. అయినా తగ్గుతున్నాడా అంటే అబ్బే తెలుగు రైట్స్ కోసం ఎక్కువ సొమ్ము డిమాండ్ చేస్తున్నాడు.

అసలే కబాలి సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్లకు పైగా నష్టపోయారు. అలాంటిది మళ్ళీ అంచనాలు లేని కాలా సినిమా ని ఇంత పెట్టి కొనండి అంటే ఎవరు మాత్రం ముందుకు వస్తారు చెప్పండి. ఇంకా కబాలి నష్టాల నుండే తేరుకోలేక పోతుంటే, ఈ టైం లో కాలా ను కోట్లు పెట్టి కొని, సినిమా ఏమాత్రం తేడా వచ్చినా భరించేంత శక్తి ఎవరికి మాత్రం ఉంటుంది. మరి ఈ సినిమా పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English