మహేష్ వెర్సస్ నాని అండ్ రవితేజ

మహేష్ వెర్సస్ నాని అండ్ రవితేజ

మహేష్ ఏంటి.. నాని, రవితేజలతో పోటీ పడటం ఏంటి అనుకుంటున్నారా? ఈ వారాంతంలో బాక్సాఫీస్ వార్ ఈ ముగ్గురి మధ్యనే ఉండబోతుండటం విశేషం. ‘మనసుకు నచ్చింది’లో మహేష్ బాబు.. ‘అ’లో నాని, రవితేజ కీలక పాత్రలు పోషించారు. ఈ కథ వాళ్ల పాత్రల నేపథ్యంలోనే ముందుకు సాగుతుంది. కానీ మనకు సినిమాలో మహేష్ బాబు, నాని, రవితేజ కనిపించరు.

కేవలం వినిపిస్తారంతే. తన అక్క మంజుల దర్శకురాలిగా పరిచయమవుతున్న ‘మనసుకు నచ్చింది’ సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా సాయం చేశాడు. ఇందులో అతను ప్రకృతికి వాయిస్ ఇవ్వడం విశేషం.

ఇక ‘అ’ సినిమాలో నాని ఒక చేపకు.. రవితేజ ఒక చెట్టుకు గొంతు అరువిచ్చారు. అసలు నానిని ఈ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ అప్రోచ్ అయ్యిందే వాయిస్ ఓవర్ కోసం. ఐతే కథ నచ్చడంతో నాని వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాక  తనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి కూడా ముందుకొచ్చాడు.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, నిత్యా మీనన్, అవసరాల శ్రీనివాస్ లాంటి చాలామంది నటీనటులున్నప్పటికీ.. నాని, రవితేజల క్యారెక్టర్లే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వాళ్ల గొంతులతో ఆ చిత్రమైన పాత్రలు ఎలా ఎలివేట్ అవుతాయో చూడాలి. మరి మహేష్-నాని అండ్ రవితేజ మధ్య బాక్సాఫీస్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English