అక్కడ రకుల్ జాతకం ఎలా ఉందో?

అక్కడ రకుల్ జాతకం ఎలా ఉందో?

తెలుగులో చిన్న సినిమాలతో ప్రస్థానం మొదలుపెట్టి చాలా త్వరగా స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఐతే ఇతర భాషల్లో ఆమెకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. తన మాతృభాష హిందీలో ఆమెకు ఇంతకుముందు చేదు అనుభవమే ఎదురైంది. రకుల్ కథానాయికగా నటించిన ‘యారియాన్’ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మరో మూడేళ్ల పాటు ఆమెకక్కడ మరో అవకాశం దక్కలేదు.

మళ్లీ గత ఏడాది నీరజ్ పాండే లాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో ‘అయ్యారీ’ చేసే ఛాన్స్ అందుకుందామె. సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్ పేయి కీలక పాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ ఇది. జనవరి 26నే విడుదల కావాల్సిన ఈ చిత్రం 20 రోజులు ఆలస్యంగా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది.

నీరజ్ ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమా ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది. ‘అయ్యారీ’ ప్రోమోలు చూస్తే ఇది కూడా స్పెషల్ మూవీలాగే అనిపించింది. డిఫెన్స్ విభాగంలో జరిగే ఒక స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఐతే ట్రైలర్ ఎంత బాగున్నప్పటికీ రకుల్ అభిమానులకు నిరాశే మిగిల్చింది.

ఇందులో ఆమె పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యముందో అన్న సందేహాలు కలిగాయి. మరి సినిమాలో రకుల్ క్యారెక్టర్ ఏంటో.. అది ఎలా సాగుతుందో చూడాలి. సినిమాకు మంచి అప్లాజ్ వచ్చి రకుల్ క్యారెక్టర్ తేలిపోయినా వేస్టే. ఆ సంగతలా ఉంటే ముందు సినిమా ఎలా ఆడుతుందో చూడాలి. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు