ఇప్పుడైనా హిట్‌ వస్తుందా పాపం!

 ఇప్పుడైనా హిట్‌ వస్తుందా పాపం!

నిర్మాత ఎం.ఎస్‌. రాజు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలని చూశారు. కానీ అప్పుడు ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. సుమంత్‌ అశ్విన్‌ని లాంఛ్‌ చేయడానికి తగ్గ కథ దొరకలేదు. స్టార్‌ డైరెక్టర్లు కొందరు అతడిని పరిచయం చేయడానికి ముందుకు వచ్చినా కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. దాంతో సుమంత్‌ని పరిచయం చేసే బాధ్యత తానే తీసుకుని 'తూనీగ తూనీగ' చిత్రం తీశారు. అది ఎప్పుడొచ్చి పోయిందో కూడా తెలీనట్టుగా ఫ్లాపయింది. 

దాంతో సుమంత్‌ అశ్విన్‌ని వేరే దర్శకుడి చేతికి అప్పగించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ అతని రెండో సినిమా డైరెక్ట్‌ చేస్తున్నాడు. 'అంతకుముందు ఆ తర్వాత' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది. మొదటి సినిమాకే రావాల్సిన క్రేజ్‌ రాకపోవడంతో సుమంత్‌ అశ్విన్‌ ఇప్పుడు సగటు హీరో అయిపోయాడు. అతనికి హిట్‌ వస్తే తప్ప ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోవడం కష్టం. చిన్న సినిమాల్లో కొన్ని ఈమధ్య సర్‌ప్రైజ్‌ హిట్స్‌ అయ్యాయి. అలానే ఈ సినిమా కూడా హిట్టయితే సుమంత్‌ అశ్విన్‌కి పెద్ద ప్రాజెక్టులు సెట్‌ అవుతాయి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు