సుమంత్ కి అంత స్పీడ్ ఎందుకో

సుమంత్ కి అంత స్పీడ్ ఎందుకో

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో సుమంత్. ఆశించిన స్థాయిలో కెరీర్ ను మలుచుకోలేకపోయిన సుమంత్.. కొంతకాలంగా అప్పడొకటి ఇప్పుడొకటి అన్నట్లుగా సినిమాలు చేస్తున్నాడు. విక్కీ డోనర్ ను నరుడా డోనరుడా పేరుతో రీమేక్ చేసి.. మంచి అంచనాలను క్రియేట్ చేసినా సక్సెస్ చిక్కలేదు. రీసెంట్ గా మళ్లీ రావా అంటూ మంచి సినిమాను తీశాననే గుర్తింపు తెచ్చుకున్నాడు.

కానీ ఈ చిత్రం కూడా సక్సెస్ ను సాధించలేకపోయింది. ప్రస్తుతం సుమంత్ ఓ థ్రిల్లర్ లో నటించేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అనిల్ శ్రీకాంతం అనే కొత్త దర్శకుడు ఈ మూవీని రూపొందిస్తాడట. ప్రేమమ్ ఫేమ్ అంజు కురియన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు ఇదం జగత్ అంటూ టైటిల్ ను ఫైనల్ చేసనట్లు తెలుస్తోంది. అయితే.. హిట్టు కొట్టి కొట్టి చాలా కాలం అయినా.. సుమంత్ ఇప్పుడు స్పీడ్ పెంచడాన్ని గమనించాలి. ఇది మాత్రమే కాదు ఇంకా నాలుగు సినిమాలకు ఒప్పుకున్నాడనే టాక్ ఉంది. వరుసపెట్టి కొత్తోళ్ళతో ఏదో ఒక సినిమా చేసుకుంటూ పోతున్నాడు సుమంత్.

ఇలా వరుసగా సినిమాలు చేయడం డబ్బులు కోసమా? సినిమాలు చేయకుండా ఉండలేకా? అనే పాయింట్ పై ఫిలింనగర్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. డబ్బుల మ్యాటర్ కంటే.. సుమంత్ కి సక్సెస్సే అసలు విషయం అన్నది సన్నిహితుల మాట. సినిమాలు చేయాలనే తపన ఒకవైపు.. కొత్త దర్శకులు నూతన తరం ఆలోచనలతో రావడం మరొకవైపు.. ఈ రెండు పాయింట్స్ ను కలిపి.. వరుసగా సినిమాలు చేసేస్తున్నాడట సుమంత్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు