నాని.. రెండు కొత్త సినిమాలు

నాని.. రెండు కొత్త సినిమాలు

ఇప్పుడు టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని ఉన్నంత ఊపులో మరే హీరో లేడు. మూడేళ్లుగా హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడతను. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ కూడా సూపర్ హిట్టయి అతడి కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందంటే నాని హవా ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. నిలకడగా విజయాలు సాధిస్తూనే.. ఏడాదికి మూడు సినిమాల చొప్పున చూసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు నాని. ప్రస్తుతం అతను మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత అక్కినేని నాగార్జునతో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేయబోయే మల్టీస్టారర్ కూడా ఖరారైంది.

ఇవి కాక నాని పేరును చాలామంది దర్శకులతో ముడిపెట్టి సినిమాలు ప్రచారంలోకి వచ్చాయి. ఐతే ఇందులో వాస్తవంగా తాను చేయబోయే సినిమాలేవో నాని స్పష్టత ఇచ్చాడు. అతను కొత్తగా రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. తనకు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి హిట్ ఇచ్చిన హను రాఘవపూడితో మరో సినిమా చేయబోతున్నానని నాని వెల్లడించాడు. అలాగే ‘ఇష్క్’.. ‘మనం’.. ‘24’ లాంటి విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనూ నటించబోతున్నట్లు తెలిపాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తర్వాత ‘లై’తో బోల్తా కొట్టిన హను.. ప్రస్తుతం శర్వానంద్‌తో సినిమా చేస్తున్నాడు. అదయ్యాక నాని సినిమా మొదలుపెడతాడు. ఇక విక్రమ్ కుమార్ ‘హలో’తో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. అతను తన తర్వాతి సినిమానే నానితో చేస్తాడా లేక వేరే సినిమా చేసొచ్చి నానితో మూవీ మొదలుపెడతాడా అన్నదానిపై స్పష్టత లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు