స్టార్ రైటర్.. మళ్ళీ అప్డేట్ ఇచ్చాడు

స్టార్ రైటర్.. మళ్ళీ అప్డేట్ ఇచ్చాడు

దర్శకులుగా మారుతున్న రైటర్ల కౌంట్ టాలీవుడ్ లో బాగానే పెరుగుతోంది. ఇప్పటికే పలువురు డైరెక్టర్ గా మారి సక్సెస్ టేస్ట్ చేస్తే.. మరికొందరు నిరాశపరిచినా మొత్తానికి దర్శకత్వంలో తమ ప్రయత్నాలను చేయగలిగారు. ఈ కోవలోకి చేరేందుకు స్టార్ రైటర్ గా గుర్తింపు పొందిన గోపీ మోహన్ కూడా తహతహలాడుతున్నాడు.

వాలంటైన్స్ డే సందర్భంగా.. తన సినిమాపై ఓ అప్ డేట్ ఇచ్చాడు గోపీ మోహన్. తను రాసుకున్న కథను 'ఇష్టంగా సంతోషంగా ఆనందంగా' చెప్పాలని తన మనసు కోరుకుంటోందన్న గోపీ మోహన్.. అతి త్వరలో ఆడియన్స్ మెచ్చే తారాగణంతో షూటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తానని అన్నాడు. తనను ప్రోత్సహిస్తున్న మిత్రులకు, ప్రియమైన భాగస్వామికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు కూడా చెప్పాడు గోపీ మోహన్. లవ్ సింబల్ లో పలు ఆకర్షణీయమైన ప్రాంతాల ఫోటోలను చేర్చి.. ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. అయితే.. 'ఇష్టంగా సంతోషంగా ఆనందంగా' అనే టైటిల్ తో సినిమా చేస్తానంటూ రెండేళ్ల నుంచి గోపీ మోహన్ చెబుతూనే ఉన్నాడు. కాకపోతే ఇప్పటికీ ఈ ప్రాజెక్టు సెట్ కాలేదు.

ముగ్గురు క్రేజీ యంగ్ హీరోలతో ఈ కథను తెరకెక్కించాలన్నది ఈ స్టార్ రైటర్ ఆలోచన. అందుకు తగ్గట్లుగా క్యాస్టింగ్ సెట్ కాకపోవడం.. ప్రొడక్షన్ వ్యయం వంటివి ప్రాజెక్టు ఆలస్యం అవడానికి కారణంగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పడం గమనించాలి. దాదాపుగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిపోయాయని.. త్వరలోనే క్యాస్టింగ్ తోపాటు సినిమా ప్రారంభంపై అధికారిక అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు