ఆమెపై దిల్ రాజుకూ డౌటొచ్చిందా?

ఆమెపై దిల్ రాజుకూ డౌటొచ్చిందా?

‘తొలి ప్రేమ’ సినిమాకు సంబంధించి రాశి ఖన్నా ఫస్ట్ లుక్ ఫొటోలు బయటికి వచ్చినపుడు చాలామంది షాకయ్యారు. ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ఆమె కథానాయికగా కరెక్టా.. అయినా కళ్లజోడుతో కామెడీగా కనిపిస్తున్న ఆమె ఈ సినిమాకు ఏమాత్రం సూటువుతుంది అన్న సందేహాలు నెలకొన్నాయి.

పైగా తెలుగులో కథానాయికగా ‘ఊహలు గుసగుసలాడే’ను మినహాయిస్తే రాశి చేసినవన్నీ మాస్ మసాలా సినిమాలే. అందులో చాలా వరకు సిల్లీ క్యారెక్టర్లే చేసింది. దీంతో రాశి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌కు పనికి రాదన్న ముద్ర పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ‘తొలి ప్రేమ’ సినిమాలో రాశి పాత్ర విషయమై అనేక సందేహాలు నెలకొన్నాయి. దర్శకుడి ఛాయిస్ కరెక్టేనా అని అనుమానంగా చూశారందరూ.

ఐతే ఈ సందేహాలకు తెరదించుతూ వర్ష పాత్రలో మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది రాశి. కెరీర్లో ఎన్నడూ చూడని యాంగిల్స్ ఈ సినిమాలో చూపించిందామె. ఈ సినిమాకు హీరో పాత్ర కంటే కూడా హీరోయిన్ రోలే హైలైట్. వ్యక్తిత్వం ఉన్న పాత్రను బాగా అర్థం చేసుకుని నటించి మెప్పించింది రాశి. ఐతే ఈ సినిమాకు రాశిని కథానాయికగా ఎంచుకున్నారని తెలిసినపుడు సామాన్య ప్రేక్షకుల్లాగే నిర్మాత దిల్ రాజు మాత్రం షాకయ్యాడట.

మాస్ సినిమాలు చేసే రాశి ఈ సినిమాకు ఎలా సూటవుతుందా అని తాను సందేహించానని.. కానీ సినిమాలో రాశి అద్భుతంగా నటించి మెప్పించిందని.. ఆమె నటన చూసి తాను ఆశ్చర్యపోయానని దిల్ రాజు చెప్పడం విశేషం. మొత్తానికి దిల్ రాజుతో పాటు అందరికీ రాశి విషయంలో ఉన్న సందేహాలన్నీ ‘తొలి ప్రేమ’తో తొలగిపోయాయన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు