మంజుల గురించి మహేష్ అంత మాటన్నాడా?

మంజుల గురించి మహేష్ అంత మాటన్నాడా?

మామూలుగా మహేష్ బాబు బయట చాలా రిజర్వ్డ్‌గా కనిపిస్తాడు. సినిమా వేడుకల్లో చాలా పొదుపుగా మాట్లాడతాడు. ఆ మాటలు కూడా సీరియస్‌గానే ఉంటాయి. కానీ సినిమా సెట్స్‌లో మహేష్ అల్లరి మామూలుగా ఉండదని.. అతను భలే పంచులు పేల్చుతాడని కోయాక్టర్స్.. టెక్నీషియన్స్ చెబుతుంటారు. ఈ విషయంలో చాలామంది గతంలో చాలా ఉదాహరణలు కూడా చెప్పారు.

ఇప్పుడు మహేష్ అక్క మంజుల తన తమ్ముడి చమత్కారం గురించి చెప్పుకొచ్చింది. తన దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ‘మనసుకు నచ్చింది’కివాయిస్ ఓవర్ చెప్పమని అడిగితే మహేష్ ఓకే చెప్పాడని.. కానీ రెండు మూడు వేరియేషన్లలో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుందని అడిగితే మాత్రం ‘వేరే వాళ్లతో చెప్పించుకో’ అని అన్నాడని మంజుల తెలిపింది.

ఇక ఒక సందర్భంలో తాను దర్శకురాలిగా మారుతున్న విషయం తెలిసిన గౌతమ్.. మహేష్ దగ్గరికి వెళ్లి నువ్వు అత్త డైరెక్షన్లో నటించొచ్చు కదా అని అన్నాడని.. దానికి బదులుగా మహేష్ ‘ఆమెతో చేస్తే అదే నా ఆఖరి సినిమా అవుతుంది’ అని బదులిచ్చినట్లు తనకు తెలిసిందంటూ తమ్ముడి చమత్కారం గురించి చెప్పుకొచ్చింది మంజుల.

మహేష్ ఎలాంటి పంచ్‌లు పేల్చుతాడో చెప్పడానికి ఇది రుజువని ‘మనసుకు నచ్చింది’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆమె చెప్పింది. తాను డైరెక్షణ్ చేస్తున్నానని చెప్పినపుడు మహేష్ షాకయ్యాడని.. ఐతే మహేష్‌తో పాటు తమ తండ్రి కృష్ణ గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు