తెలుగు పిల్లే.. కాంప్లికేటెడ్ తెలుగు రాదు

తెలుగు పిల్లే.. కాంప్లికేటెడ్ తెలుగు రాదు

మహేష్ బాబు సోదరి మంజుల తొలిసారిగా దర్శకత్వం వహించి రూపొందించిన చిత్రం మనసుకు నచ్చింది. గత నెలలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాలతో వాయిదా ఈ నెల 16కు వాయిదా పడింది.

ఇప్పుడీ మూవీ ప్రమోషన్స్ ను అగ్రెసివ్ గానే చేస్తోంది యూనిట్. దర్శకురాలు మంజుల కొన్ని వారాల ముందు నుంచే ప్రచారం చేస్తుండగా.. ఇప్పుడు మంజుల కూతురు జానవి కూడా వీటిలో భాగం అయింది. ఈమె ప్రచారంలోకి రావడానికి కారణం.. ఈ టీనేజర్ కూడా సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడమే. సందీప్ కిషన్.. అమైరా దస్తూర్ నటించిన ఈ చిత్రంలో జానవి పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. ఇప్పుడీ చిన్నది ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తోంది. మంజుల కూతురుగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యురాలిగా ఈమెను తెలుగు అమ్మాయిగానే మనమంతా గుర్తించడం సహజం.

కానీ ఈ పిల్లకు అసలు తెలుగు రానే రాదు. 'నాకు తెలుగు వస్తుంది.. బట్.. కాంప్లికేటెడ్ తెలుగు  రాదు' అంటూ అచ్చమైన ఇంగ్లీష్ మాడ్యులేషన్ లోనే తెలుగు మాట్లాడుతోంది జానవి. అలాంటి తెలుగు మాట్లాడడం కంటే యాక్టింగ్ చేయడమే సింపుల్ అని అర్ధమయిపోయిందట. ఈ సినిమా చేసేటప్పుడు ఎందుకు నటిస్తానని ఒప్పుకున్నాన్రా బాబూ అని ప్రతీ సీన్ చేసేటపుడు అనుకుందట. అందుకు అంత కాంప్లికేటెడ్ తెలుగు మాట్లాడాల్సి రావడమే కారణం అని చెబుతోంది జానవి. కంప్లీట్ గా అమెరికాలోనే పెరగడమే ఈమె ఇలాంటి తెలుగు మాట్లాడ్డానికి అసలు కారణం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు