వాళ్ల అవసరాన్ని క్యాష్‌ చేసుకుంటోన్న శ్రియ

వాళ్ల అవసరాన్ని క్యాష్‌ చేసుకుంటోన్న శ్రియ

యువ హీరోల సరసన నటించేంత యంగ్‌ కాకపోవడంతో శ్రియా శరన్‌కి ఏనాడో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే సీనియర్‌ హీరోలకి హీరోయిన్లు దొరకని పరిస్థితి తలెత్తడంతో వారి సినిమాలకి ఆమే ఆపద్భాందవి అవుతోంది. బాలకృష్ణతో వరుసగా గౌతమిపుత్ర శాతకర్ణి, పైసావసూల్‌ చిత్రాల్లో నటించిన శ్రియ అంతకుముందు వెంకీతో గోపాల గోపాల, నాగార్జునతో ఊపిరి చిత్రాల్లో నటించింది.

రీసెంట్‌గా మోహన్‌బాబు గాయత్రిలోను కీలక పాత్ర చేసిన శ్రియ తాజాగా మరో క్రేజీ చిత్రాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్‌తో తేజ డైరెక్షన్‌లో రూపొందుతోన్న 'ఆట నాదే వేట నాదే' చిత్రానికి హీరోయిన్‌ దొరకలేదు. నయనతార ఇప్పటికే చాలా సార్లు వెంకటేష్‌తో నటించడంతో మరో ఆప్షన్‌ కోసం చూసారు. కాజల్‌ చాలా ఎక్కువ పారితోషికం అడగడంతో అదితి రావు హైదారీ డేట్ల కోసం ప్రయత్నించారు.

ఆమె దీని కంటే మణిరత్నం సినిమా బెటర్‌ అంటూ దానికి డేట్స్‌ ఇచ్చేసింది. దీంతో ఇక హీరోయిన్‌ దొరక్క శ్రియనే తీసుకున్నారు. ఇలా సీనియర్‌ హీరోలకి హీరోయిన్లు దొరకని సిట్యువేషన్‌ని శ్రియ రెగ్యులర్‌గా క్యాష్‌ చేసుకుంటూ ఇప్పటికీ రెండు చేతులా సంపాదిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English