కరుణాకరన్‌పై మెగా ఒత్తిడి

కరుణాకరన్‌పై మెగా ఒత్తిడి

'తొలిప్రేమ'తో పవన్‌కళ్యాణ్‌ని స్టార్‌ని చేసిన కరుణాకరన్‌ మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. డార్లింగ్‌తో ప్రభాస్‌కి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫాలోయింగ్‌ పెరగడంలో పాత్ర పోషించిన కరుణాకరన్‌ 'ఉల్లాసంగా ఉత్సాహంగా'తో హిట్‌ అందుకున్నాడు. అయితే ఇప్పటికీ అతనికి ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన తొలిప్రేమ దర్శకుడిగానే గుర్తింపు తప్ప కెరియర్లో నిలిచిపోయే మరో చిత్రాన్ని అయితే ఇవ్వలేకపోయాడు.

పవన్‌, రామ్‌ లాంటి వాళ్లు అతనికి అవకాశాలిచ్చినా కానీ నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో అంతా మర్చిపోయిన కరుణాకరన్‌తో సాయిధరమ్‌ తేజ్‌ ఏరి కోరి సినిమా చేస్తున్నాడు. తనకి వున్న మాస్‌ ఇమేజ్‌ని పోగొట్టే క్లాస్‌ ఫిలిం అతనైతే ఇవ్వగలడని సాయి ధరమ్‌ తేజ్‌ అతనితో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఎప్పుడో మొదలైన ఈ చిత్రాన్ని పక్కనపెట్టి వినాయక్‌తో 'ఇంటిలిజెంట్‌' చిత్రం పూర్తి చేసిన తేజ్‌కి ఆ చిత్రంతో ఘోర పరాజయం ఎదురైంది.

దీంతో వరుసగా అయిదు భారీ ఫ్లాపులతో ప్రస్తుతం అతనికి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీంతో కరుణాకరన్‌ సినిమా పట్ల అధిక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ సినిమా మిస్‌ఫైర్‌ కాకూడదంటూ అతడిపై ఒత్తిడి పెంచుతున్నారట. ఇప్పటికే తేజ్‌ని ఫెయిల్యూర్‌గా కొట్టి పారేస్తున్న మీడియా ఈ టైమ్‌లో అతనికి మరో ఫ్లాప్‌ పడితే మాత్రం ఇక అతడిని పూర్తిగా రైట్‌ ఆఫ్‌ చేస్తుంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English