శ్రియ సుడి ఇలా ఉందేంటో..

శ్రియ సుడి ఇలా ఉందేంటో..

లేటు వయసులో మంచి మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది శ్రియ సరన్. పోయినేడాది నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో ఆమె రెండు సినిమాలు చేయడం విశేషం. అందులో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రం కూడా ఉంది. ఆ సినిమాలో శ్రియ పాత్ర ఎంత కీలకమైందో.. ఆమె ఎంత బాగా నటించి మెప్పించిందో తెలిసిందే.

ఇటీవలే విడుదలైన ‘గాయత్రి’ సినిమాలోనూ ఆమె ఒక కీ రోల్ చేసింది. త్వరలో విడుదల కాబోతున్న ‘వీర భోగ వసంత రాయలు’ అనే వైవిధ్యమైన సినిమాలోనూ శ్రియ కనిపించనుంది. ఇప్పుడు శ్రియకు మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు సమాచారం.

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్-తేజ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రియనే కథానాయికగా ఖరారైందట. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చాన్నాళ్లుగా వేట సాగతుంది. కాజల్ అగర్వాల్ సహా రకరకాల పేర్లు అనుకుని.. చివరికి ఓ కొత్త కథానాయిక కోసం కూడా ట్రై చేశారు. కానీ ఎవ్వరూ సెట్ కాలేదు. ఇందులో కథానాయిక ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించాల్సి ఉండటం కూడా అందుకు కారణం కావచ్చు.

ఐతే ఇప్పటికే పిల్లల తల్లిగా పలుమార్లు కనిపించిన శ్రియ ఈ పాత్ర చేయడానికి ఓకే చెప్పిందట. శ్రియ వెంకీ సరసన ‘సుభాష్ చంద్రబోస్’.. ‘గోపాల గోపాల’ సినిమాల్లో నటించింది. హీరో హీరోయిన్లు సీనియర్లే కానీ.. ఈ చిత్రంలో 70 శాతం మంది కొత్త నటీనటులే కనిపిస్తారట. సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English