వీరంతా రాత్రికి రాత్రే సెల‌బ్రిటీల‌యిపోయారు!

వీరంతా రాత్రికి రాత్రే సెల‌బ్రిటీల‌యిపోయారు!

``ప్రియా...ప్రియా చంపొద్దే....న‌వ్వీ న‌న్నే ముంచొద్దే......చెలీ క‌న్నుల‌తో క‌నుసైగల‌తో హృద‌యం కాల్చొద్దే....అయ్యో వ‌న్నెల‌తో ప్రాణం తీయొద్దే.....`` అంటూ .....కుర్ర‌కారంతా తెగ పాట‌లు పాడేసుకుంటున్నారు. త‌న కంటిచూపుతో యూత్ ను ఉక్కిరి బిక్కిరి చేసిన మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ పేరు ఇపుడు నేష‌న‌ల్  వైడ్ ట్రెండింగ్ లో ఉంది.

క‌ళ్ల‌తోనే కోటి భావాల‌ను ప‌లికించిన ఈ అమ్మ‌డు....ఓవ‌ర్ నైట్ లో సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీ అయిపోయింది. సినీరంగంలో అరంగేట్రం చేయ‌క‌ముందే ఇంత పాపుల‌ర్ అయిన హీరోయిన్ మ‌రొక‌రు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ‘ఒరు అదర్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటలో ప్రియా హావభావాలకి యూత్ ఫిదా అయిపోయారు. ఈ అందాల భామ ఎవ‌రంటూ `గూగుల్ త‌ల్లి`ని కుర్ర‌కారు తెగ ఇబ్బందిపెట్టేస్తున్నారు.

తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్, ఐటం బాంబ్  స‌న్నీ లియోన్ లు కూడా ప్రియా `వార్` ముందు నిల‌వ‌లేక‌పోయారు. గూగుల్ సెర్చ్ లో ఇప్ప‌టివ‌ర‌కు టాప్ ప్లేస్ లో ఉన్న స‌న్నిలియోన్ ను ప్రియా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే వెన‌క్కు నెట్టేసిందంటే ఈ అమ్మ‌డికున్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు. 25 సెక‌న్లున్న ప్రియా ఎక్స్ ప్రెష‌న్స్ వీడియో ఇపుడు ఇంట‌ర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది. కొన్ని కోట్ల మందిని వీక్ష‌కుల‌ను క్షణాల్లో కట్టిపడేసింది. అయితే, ఇదే విధంగా గ‌తంలో కూడా కొంత‌మంది వ్య‌క్తులు ఓవ‌ర్ నైట్ లో సెల‌బ్రిటీలు అయిపోయారు.

2016లో పాకిస్థాన్ కు చెందిన  చాయ్ వాలా అర్ష‌ద్ ఖాన్ బాగా పాపుల‌ర్ అయ్యాడు. ఆ నీలిక‌ళ్ల యువ‌కుడికి అమ్మాయిలు ఫిదా అయిపోయారు. అత‌డి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఓవ‌ర్ నైట్ లో అర్ష‌ద్ సెల‌బ్రిటీగా మారిపోయాడు. ఆ త‌ర్వాత అర్ష‌ద్ కు మోడ‌లింగ్ ఆఫ‌ర్స్, యాడ్ ఫిల్మ్స్ లో చాన్సులు వ‌చ్చాయి. ఓ ఫ్యాష‌న్ వెబ్ సైట్ తో అత‌డు ఒప్పందం కూడా కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఆ త‌ర్వాత అత‌డు అప్ఘానిస్థాన్ కు చెందిన వాడ‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

ఫ్లోరిడాకు చెందిన సామీ గ్రైన‌ర్ కు స‌క్సెస్ కిడ్ అనే పేరు వ‌చ్చింది. ఇసుక‌ను పిడికిలిలో బంధించి....పెదాల‌ను బిగించి ఈ చిన్నోడు ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెష‌న్ కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. దీంతో, ఆ ఫొటో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. త‌న పాపులారిటీతో సంపాదించిన డ‌బ్బుతో సామీ....త‌న తండ్రికి వైద్యం చేయించాడు.

మీకు హోట‌ళ్లు కావాలా....త‌క్కువ ధ‌ర‌కు హోట‌ళ్లు, రెస్టారెంట్ల వివ‌రాల‌ను మేం అందిస్తాం....అంటూ గ‌ల‌గ‌లా మాట్ల‌డేస్తూ నెటిజ‌న్లు తెగ ఇబ్బంది పెట్టేసే `ట్రివాగో` యాడ్ లో న‌టించిన అభిన‌వ్ కుమార్ కోసం కూడా నెటిజ‌న్లు తెగ వెతికారు. అయితే, అంద‌రూ అనుకున్న‌ట్లు ఆయ‌న మోడ‌ల్ కాదట‌. ట్రివాగో కంట్రీ మేనేజ‌ర్ అట‌!

ఎయిర్ టెల్ 4జీ యాడ్ లో న‌టించిన సాషా ఛెత్రీ కూడా ఓవ‌ర్ నైట్లో  బాగా పాపుల‌ర్ అయింది. ఈ అమ్మాయి స్మైల్ , గ‌ల‌గ‌ల మాట‌ల‌కు యూత్ ఫ్లాట్ అయిపోయారు. తాజాగా, ఈ అమ్మాయి ఓ తెలుగు సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేయ‌బోతోంది.

అదే త‌ర‌హాలో, త‌న క‌ర్ణ క‌ఠోరమైన గొంతుతో సోష‌ల్ మీడియాను చీల్చి చెండాడిన ధించ‌క్ పూజ, తాహెర్ షా, ర్యాప‌ర్ ఓంప్ర‌కాష్, ఇక తెలుగు విష‌యానికి వ‌స్తే...డార్లింగ్ దాస్, దీప్తి సున‌య‌నా, డైవ‌ర్ష‌న్ ఆంటీ....వీళ్లంతా త‌మ నెగెటివ్ ఇంపాక్ట్ తో ఓ మోస్త‌రు పాపుల‌ర్ అయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English